తెలంగాణ

telangana

ETV Bharat / sports

వరల్డ్ కప్ 2023 సెమీస్​ - ఈ రెండు గెలిస్తే ఆ నాలుగు ఔట్‌ - వన్డే వరల్డ్​కప్​ 2023 సెమీస్​ బెర్త్​

ODI World Cup 2023 Semi Final : ప్రపంచకప్‌ 2023 నేడు(నవంబర్ 4) ఆసక్తికర సమరాలు జరగబోతున్నాయి. సెమీస్‌ అవకాశాలను మెరుగుపరుచుకునే దిశగా ఐదో విజయంపై దృష్టిసారించిన రెండు జట్లు.. కీలక మ్యూచుల్లో తలపడేందుకు సిద్ధమయ్యాయి.

ODI World Cup 2023 Semi Final
వన్డే వరల్డ్​కప్​ 2023 సెమీస్​ బెర్త్​

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 7:10 AM IST

Updated : Nov 4, 2023, 7:26 AM IST

ODI World Cup 2023 Semi Final : ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్‌ 2023లో శనివారం(నవంబర్ 4) ఆసక్తికర సమరాలు జరగబోతున్నాయి. సెమీస్‌ ఛాన్స్​లను మెరుగుపరుచుకునే దిశగా ఐదో విజయంపై దృష్టిసారించిన రెండు టీమ్స్​.. కీలక మ్యాచులు ఆడేందుకు రెడీ అయ్యాయి.

6 మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు.. ఇంగ్లాండ్‌ టీమ్​తో తలపడబోతుండగా.. 7 మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో గెలుపును అందుకున్న న్యూజిలాండ్‌ జట్టు.. పాకిస్థాన్‌ టీమ్​తో పోటీపడనుంది.

ODI World Cup 2023 Aus VS Eng : మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడి ఆ తర్వాత బలంగా పుంజుకున్న ఆస్ట్రేలియా​ ప్రస్తుతం వరుసగా నాలుగు విజయాలు సాధించిన ఊపు మీదుంది. దీంతో సెమీస్‌ దిశగా దూసుకెళ్తోంది. అయితే గాయం కారణంగా మ్యాక్స్‌వెల్‌, వ్యక్తిగత కారణాలతో మిచెల్‌ మార్ష్‌ దూరం కావడం వల్ల ఆ జట్టుపై ప్రభావం చూపేదె.

మరోవైపు 6 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో ఓడిన ఇంగ్లాండ్ జట్టు​ దాదాపుగా సెమీస్‌కు దూరమైనట్టే. సెమీస్‌ చేరే అవకాశం లేనందున, కనీసం పరువును కాపాడుకునేందుకైనా ఆ జట్టు తెగించి ఆడే ఛాన్స్​ ఉంది. కాబట్టి ఆసీస్‌ చాలా జాగ్రత్తగా ఈ మ్యాచ్​ ఆడాల్సిన అవసరం ఉంది.

ODI World Cup 2023 Nz VS Pak :ఇక నాలుగు వరుస విజయాలతో టోర్నీని ఘనంగా ప్రారంభించింది న్యూజిలాండ్​. కానీ ఆ తర్వాత హ్యాట్రిక్‌ ఓటములతో ఇబ్బందుల్లోకి వెళ్లిపోయింది. విలియమ్సన్‌ ఇప్పటి వరకు ఒక్క మ్యాచే ఆడటం.. పేసర్‌ హెన్రీ గాయంతో మిగతా టోర్నీకి దూరం కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే.

మరోవైపు 7 మ్యాచులు ఆడి మూడింటిలో విజయం సాధించిన పాకిస్థాన్‌ జట్టుకు సెమీస్‌ ఛాన్స్​లు తక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ ఆ టీమ్​ ఆశతోనే ఉంది. అయితే శనివారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​ గెలిస్తే.. పాకిస్థాన్‌, శ్రీలంక, ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌ ఐదో విజయం సాధించలేవు కాబట్టి ఒకేసారి ఈ జట్లన్నీ టోర్నీ నుంచి వైదొలుగుతాయి.

మెగాటోర్నీలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్​గా అఫ్గాన్​​-సెమీస్ చేరేందుకు ఇంకా ఛాన్స్​!

మెగాటోర్నీలో అఫ్గానిస్థాన్ హ్యాట్రిక్ విక్టరీ, చిత్తుగా ఓడిన నెదర్లాండ్స్

Last Updated : Nov 4, 2023, 7:26 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details