ODI World Cup 2023 PAK VS South Africa : వన్డే ప్రపంచకప్ - 2023లో భాగంగా జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ - దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ బాబర్ అజామ్ (50), సౌద్ షకీల్ (52) హాఫ్ సెంచరీలతో అద్భుతంగా రాణించారు. షాదాబ్ ఖాన్ (43) ఫర్వాలేదనిపించాడు. సఫారీ బౌలర్లలో తబ్రైజ్ షంసీ 4 వికెట్లు, మార్కో జాన్సన్ 3 వికెట్లు, గెరాల్డ్ కొయిట్జీ 2, లుంగి ఎంగిడి ఒక వికెట్ దక్కించుకున్నారు.
బాబర్ ఇలా ఔట్ అయ్యాడంటి?.. ఈ మ్యాచ్‌తో మరో హాఫ్ సెంచరీను తన ఖాతాలో వేసుకున్నాడు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం. 65 బంతులను ఎదుర్కొన్న అతడు.. 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు చేశాడు. అయితే దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు. పాకిస్థాన్ ఇన్నింగ్స్ 28 ఓవర్ వేసిన స్పిన్నర్ షంసీ బౌలింగ్‌లో ఐదో బంతిని బాబర్ ల్యాప్ స్వీప్ షాట్ ఆడాడు. కానీ ఆ షాట్ బాదడంతో అతడు ఫెయిల్ అయ్యాడు. బంతి లెగ్ స్టంప్‌ను మిస్ అవుతూ వికెట్ కీపర్ డికాక్ చేతికి వెళ్లిపోయింది. అలానే బంతి బ్యాట్‌కు దగ్గరగా కూడా వెళ్లున్నట్లు కనిపించింది. దీంతో డికాక్ క్యాచ్‌కు అప్పీల్ చేయగా.. అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. అయితే దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా ఆఖరి సెకెండ్‌లో రివ్యూ తీసుకోగా.. రిప్లేలో బాబర్ చేతి గ్లావ్‌కు బంతి తాకినట్లు స్పష్టమైంది. దీంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని ఔట్‌గా అనౌన్స్ చేశాడు. బాబర్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు.