ODI World Cup 2023 Newzealand vs England Records :2023 వన్డే ప్రపంచకప్‌నకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఆరంభ మ్యాచ్‌లో పరుగుల వరద పారడం సహా పలు ప్రపంచ రికార్డులు కూడా నమోదు అయ్యాయి. గత ప్రపంచ కప్(2019) ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఓటమికి న్యూజిలాండ్ తాజాగా ప్రతీకారం తీర్చుకుంది. తాజాగా అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు.. ఇంగ్లాండ్‌ను 9 వికెట్ల భారీ తేడాతో ఓడించి ఈ టోర్నీలో బోణీ కొట్టింది.
- నమోదైన రికార్డులివే..(Newzealand vs England Records)
- ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.2 ఓవర్లలో ఛేదించింది న్యూజిలాండ్. దీంతో ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగంగా 280 లేదా అంతకన్నా ఎక్కువ స్కోరును ఛేదించిన జట్టుగా రికార్డు కెక్కింది.
- ఈ మ్యాచ్‌లో బెయిర్ స్టో ఇంగ్లాండ్ పరుగుల ఖాతాను సిక్సర్‌తో తెరవడం ఆల్‌టైమ్ ప్రపంచ కప్ రికార్డ్. వరల్డ్ కప్ హిస్టరీలో తొలి పరుగులు సిక్సర్ రూపంలో రావడం ఇదే మొదటి సారి.
- ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ తరఫున ఏ వికెట్ కైనా అత్యుత్తమ భాగస్వామ్యం.. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర నమోదు చేసిన అజేయ 273 పరుగులు.
- ప్రపంచకప్ అరంగేట్రంలోనే శతకం బాదిన మూడో అతి పిన్న వయస్కుడిగా 23 ఏళ్ల, 321 రోజులు రచిన్ రవీంద్ర రికార్డ్ కెక్కాడు. వరల్డ్‌కప్ అరంగేట్రంలో సెంచరీ చేసిన రెండో అతి పెద్ద వయస్కుడిగా (32 ఏళ్ల 89 రోజులు) కాన్వే రికార్డుల్లోకెక్కాడు.
- డెవాన్ కాన్వే న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 22 ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు.
- ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో 11 మంది ప్లేయర్లు రెండంకెల స్కోర్ చేయడం విశేషం. 4658 వన్డేల చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటి సారి. ఇది వరల్డ్ రికార్డు.
కాగా, ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్యాన్ని న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ కోల్పోయి విజయం సాధించింది.