తెలంగాణ

telangana

ETV Bharat / sports

ODI World Cup 2023 Ind Vs Pak : టీమ్​ఇండియా బౌలర్ల మ్యాజిక్​.. పాక్ బ్యాటర్ల ఫ్యూజులు ఔట్​.. లక్ష్యం ఎంతంటే? - బాబర్ ఆజామ్ హాప్ సెంచరీ

ODI World Cup 2023 Ind Vs Pak : వన్డే వరల్డ్ కప్​ 2023లో భాగంగా టీమ్​ ఇండియాతో జరుగుతున్న హై ఓల్టేజ్​ మ్యాచ్​లో పాకిస్థాన్​ ఇన్నింగ్స్ ముగిసింది. టీమ్​ఇండియా బౌలర్లు అదరగొట్టారు. ఇక టీమ్​ ఇండియా లక్ష్యం ఎంతంటే?

ODI World Cup 2023 Ind Vs Pak : టీమ్​ఇండియా బౌలర్ల మ్యాజిక్​.. పాక్ బ్యాటర్ల ఫ్యూజులు ఔట్​
ODI World Cup 2023 Ind Vs Pak : టీమ్​ఇండియా బౌలర్ల మ్యాజిక్​.. పాక్ బ్యాటర్ల ఫ్యూజులు ఔట్​

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 5:38 PM IST

Updated : Oct 14, 2023, 8:28 PM IST

ODI World Cup 2023 IND VS PAK : వన్డే వరల్డ్ కప్​ 2023లో భాగంగా టీమ్​ ఇండియాతో జరుగుతున్న హై ఓల్టేజ్​ మ్యాచ్​లో పాకిస్థాన్​ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 50 ఓవరల్లో ఇన్ని పరుగులు చేసి ఆలౌట్​ అయింది. దాయాది జట్టు కెప్టెన్ బాబర్ అజామ్‌(58 బంతుల్లో 50; 7x4) హై స్కోరర్​. మహ్మద్​ రిజ్వాన్​(69 బంతుల్లో 49; 7 x4), ఇమామ్ ఉల్ హక్​(38 బంతుల్లో 36 ; 6x4), అబ్దుల్లో షాహిక్​(24 బంతుల్లో 20; 3x4) పరుగులు చేశారు. సౌద్ షకీల్​(6), ఇఫ్టీఖర్ అహ్మద్​(4), షాదబ్​ ఖాన్​(2), మహ్మద్​ నవాజ్​(4), హసన్ అలీ(12) నామమాత్రపు స్కోర్ చేశారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్​, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్​ వికెట్లు తీశారు.

వారిద్దరే..పాక్ ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. మొదటి వికెట్‌కు అబ్దుల్లా షెఫీక్​-ఇమామ్‌ కలిసి 41 పరుగులు జోడించారు. అయితే వీరి జోడీని సిరాజ్‌ విడగొట్టాడు. అబ్దుల్లా తొలి వికెట్​గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే.. ఇమామ్‌ను తమ అద్భుతమైన బంతితో హార్దిక్‌ బోల్తా కొట్టించాడు. అనంతరం భారత్‌పై మంచి రికార్డు కలిగిన పాకిస్థాన్​ కెప్టెన్ బాబర్ అజామ్‌ - రిజ్వాన్ క్రీజ్‌లోకి పాతుకుపోయేందుకు ప్రయతించారు. మూడో వికెట్‌కు 82 పరుగులను నమోదు చేశారు. దీంతో 29 ఓవర్లకు పాక్‌ 150/2 స్కోరుతో నిలిచింది. అయితే ఈ జోడీని మళ్లీ సిరాజే విడగొట్టాడు. హాఫ్​ సెంచరీ కంప్లీట్​ చేసుకున్న బాబర్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసి పెవిలియన్ పంపాడు.

37 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లు..

బాబర్‌ అజామ్‌ను ఔట్‌ చేసిన తర్వాత భారత బౌలర్లు మరింత రెచ్చిపోయి ఆడారు. ఒకే ఓవర్‌లో షకీల్, ఇఫ్తికార్‌ను కుల్దీప్​ ఔట్ చేశాడు. షకీల్​ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూ తీసుకున్న టీమ్​ఇండియాకు అనుకూలంగా ఫలితం దక్కింది. ఆ తర్వాత ఇఫ్తికార్‌ను కుల్‌దీప్‌ బౌల్డ్‌ చేశాడు. అనంతరం మరికాసేపటికే కీలకమైన రిజ్వాన్‌ను, షాదాబ్‌ ఖాన్‌ను తన వరుస ఓవర్లలో బుమ్రా కూడా క్లీన్‌బౌల్డ్‌ చేసేశాడు. కేవలం ఐదు ఓవర్ల వ్యవధిలో ఐదు వికెట్లను కోల్పోయి పాక్​ చతికిలపడే దిశగా వెళ్లిపోయింది. మహమ్మద్‌ నవాజ్ (4), హసన్ అలీ (12) క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో 29.3 ఓవర్లకు 154/2 స్కోరుతో ఉన్న పాకిస్థాన్​ జట్టు 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌట్ అయింది. కేవలం 37 పరుగుల వ్యవధిలో చివరి ఎనిమిది వికెట్లను కోల్పోయింది.

మ్యాచ్​ను వీక్షించిన అమిత్ షా... ఇకపోతే నరేంద్రమోదీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో కేంద్రమంత్రి అమిత్ షా సందడి చేశారు. మ్యాచ్​ను ప్రత్యేక్షంగా వీక్షించారు. నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు గుజరాత్‌లో ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు గుజరాత్ వెళ్లిన ఆయన.. ఈ మ్యాచ్​ను కూడా లైవ్​లో చూశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.

ODI World Cup 2023 Ind Vs Pak : ఐదుగురు తలో రెండు వికెట్లు.. పాక్​పై భారత బౌలర్ల మ్యాజిక్​ వీడియోలు చూశారా?

Last Updated : Oct 14, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details