తెలంగాణ

telangana

ETV Bharat / sports

ODI World Cup 2023 IND VS PAK : మ్యాచ్ విన్నింగ్​ షాట్​.. రోహిత్​ సిక్సర్ల వీడియో మీకోసం.. - గెలుపుపై రోహిత్ స్పందన

ODI World Cup 2023 Ind Vs Pak : వన్డే వరల్డ్ కప్​ 2023లో భాగంగా జరిగిన హై టెన్షన్​ మ్యాచ్​లో టీమ్​ ఇండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్​ విన్నింగ్ షాట్​, రోహిత్ శర్మ సిక్సర్లు, పాక్ వికెట్ల పతనం వంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం..

.
.

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 10:19 PM IST

ODI World Cup 2023 IND VS PAK :రోహిత్ శర్మ సిక్స్​లు.. వన్డే ప్రపంచకప్​ 2023లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్​ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్థాన్​ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని 30.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ వరల్డ్​ కప్​లో హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది.

Rohith Sharma Sixes : కెప్టెన్ రోహిత్‌ శర్మ 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 86 పరుగులు చేసి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ హైఓల్టేజ్​ మ్యాచ్​లో రోహిత్​.. అలవోకగా ఆరు సిక్స్‌లు బాదా మరోసారి ఔరా అనిపించాడు. ఆ వీడియో మీకోసం..

IND VS PAK Shreyas Iyer : పాక్‌ నిర్దేశించిన 192 లక్ష్యాన్ని అలవోకగా ఛేదించే క్రమంలో.. ఓ ఫోర్​తో శ్రేయస్‌ అయ్యర్‌ విన్నింగ్‌ షాట్ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఆ వీడియో మీకోసం..

Pakistan Wickets : ఇక ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్​.. 42.5 ఓవర్లకే ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే. మరి పాక్‌ వికెట్ల పతనం ఎలా జరిగిందో ఈ వీడియోలో లుక్కేయండి..

IND VS PAK Sachin Tendulkar : ఇకపోతే ఈ మ్యాచ్​లో దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌.. స్టేడియంలో సందడి చేశాడు. టీమ్‌ ఇండియా ఆటగాళ్లను కలిసి ఉత్సాహపరిచాడు. కామెంటరీ కూడా చేశాడు. క్రికెట్​ గాడ్​.. ఆటగాళ్లను ఉత్సాహపరిచిన వీడియోను చూసేయండి..

కాగా, ఈ మ్యాచ్​లో రోహిత్ శర్మ(86) కెప్టెన్ ఇన్నింగ్స్​తో పాటు శ్రేయస్​ అయ్యర్​(53*; 62 బంతుల్లో) అద్భుతంగా ఆడాడు. గిల్(11 బంతుల్లో 16; 4 x 6), కోహ్లీ(18 బంతుల్లో 16; 3 x4) కాస్త దూకుడుగా ఆడి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. కేఎల్‌ రాహుల్‌ 19 (29 బంతుల్లో 2 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రీది 2 వికెట్లు పడగొట్టగా.. హసన్ అలీ ఓ వికెట్ తీశాడు. అంతకుముందునిర్ణీత 50 ఓవరల్లో 191 పరుగులు చేసి ఆలౌట్​ అయింది పాక్​. కెప్టెన్ బాబర్ అజామ్‌(58 బంతుల్లో 50; 7x4) ఆ జట్టులో టాప్​ స్కోరర్​. మహ్మద్​ రిజ్వాన్​(69 బంతుల్లో 49; 7 x4), ఇమామ్ ఉల్ హక్​(38 బంతుల్లో 36 ; 6x4), అబ్దుల్లో షాహిక్​(24 బంతుల్లో 20; 3x4) పరుగులు చేశారు.

ODI World Cup 2023 Ind Vs Pak : ఐదుగురు తలో రెండు వికెట్లు.. పాక్​పై భారత బౌలర్ల మ్యాజిక్​ వీడియోలు చూశారా?

ABOUT THE AUTHOR

...view details