తెలంగాణ

telangana

ETV Bharat / sports

ODI World cup 2023 IND vs ENG : మనల్నెవడ్రా ఆపేది.. భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్​ బ్యాటర్లు పెవిలియన్​కు ఇలా.. - వరల్డ్ కప్​ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ స్కోరు

ODI World cup 2023 IND vs ENG : లఖ్​నవూ వేదికగా ఇంగ్లాండ్​తో తలపడిన మ్యాచ్​తో టీమ్​ఇండియా డబుల్ హ్యట్రిక్​ను నమోదు చేసింది. మరి ఈ మ్యాచ్​లో మన బౌలర్లు.. ఇంగ్లాండ్ బ్యాటర్లను ఒక్కొక్కరిగా ఎలా పెవిలియన్​కు పంపించారో తెలుసుకుందాం..

ODI World cup 2023 IND vs ENG : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. పెవిలియన్​కు ఇంగ్లాండ్​ బ్యాటర్లు ఇలా..
ODI World cup 2023 IND vs ENG : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. పెవిలియన్​కు ఇంగ్లాండ్​ బ్యాటర్లు ఇలా..

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 12:09 PM IST

ODI World cup 2023 IND vs ENG: సొంతగడ్డపై టీమ్​ఇండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఓటమీ అనేది లేకుండా ఆడిన ఆరు మ్యాచ్​ల్లోనూ విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో టాప్​లో నిలిచింది. తొలి ఐదు విజయాలు ఒకెత్తు అయితే.. ఆరో విజయం మరో ఎత్తు అనే చెప్పాలి. భారత్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్​ చేసి మ్యాచ్​ను విజయం దిశగా మార్చారు. ఇంగ్లాండ్ బ్యాటర్లను..భారత్​ బౌలర్లు తమ బౌలింగ్​తో బెంబేలెత్తించి పెవిలియన్​కు పంపించారు. మరి ఏ వికెట్​ ఎలా పడగొట్టారో చూద్దాం.

  • డేవిడ్​ మలన్(16).. బుమ్రా ఆఫ్ వికెట్‌ మీదుగా సంధించిన బంతిని 4.5వ ఓవర్ దగ్గర స్క్వేర్‌ కట్‌ ఆడాలని మలన్‌ భావించాడు. అయితే బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ను తీసుకుని స్టంప్స్‌ను పడగొట్టేసింది. నిలకడగా ఆడుతున్న మలన్‌ వికెట్ పడటంతో భారత శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి.
  • జో రూట్‌(0).. క్రీజ్‌లో పాతుకుపోతే ఓ పట్టాన వదలని ఆటగాడు జో రూట్. అలాంటి ఆటగాడిని ఆడిన తొలి బంతికే పెవిలియన్‌కు పంపేశారు మన బౌలర్లు. మలన్‌ను బౌల్డ్‌ చేసిన ఉత్సాహంతో ఉన్న బుమ్రా తన తర్వాతి బంతికే రూట్‌ను వికెట్ల ముందు పట్టేశాడు. ఇంగ్లాండ్‌ డీఆర్‌ఎస్‌కు వెళ్లినా.. ఎల్బీడబ్ల్యూ నిర్ణయం భారత్‌కే అనుకూలంగా వచ్చింది.
  • బెన్‌ స్టోక్స్‌ (0).. 9 బంతులు ఆడినా పరుగుల ఖాతా తెరవకపోవడంతో బెన్‌ అసహనంతో కనిపించాడు. దానిని షమీ క్యాష్‌ చేసుకున్నాడు. షమీ బెన్​ స్టోక్స్​ను 7.6వ ఓవర్​ వద్ద క్లీన్​బౌల్డ్ చేశాడు.
  • బెయిర్‌ స్టో (14).. షమీ తన మూడో ఓవర్‌ తొలి బంతికే బెయిర్‌స్టోను బౌల్డ్‌ చేశాడు. ఆఫ్‌సైడ్‌ వేసిన బంతిని ఆడే క్రమంలో ఎడ్జ్‌ తీసుకోవడంతో బంతి వికెట్లను తాకేసింది. హ్యాట్రిక్‌పై ఉన్న షమీ వేసిన తర్వాత బంతిని మొయిన్‌ అలీ డిఫెన్స్‌ ఆడేశాడు. లేకపోతే 2019లో లాగా వరల్డ్‌ కప్‌లో మరో హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకునేవాడు.
  • జోస్ బట్లర్‌ (10).. ఈ వన్డే ప్రపంచకప్‌ చరిత్రలోనే అద్భుతమైన డెలివరీని కుల్‌దీప్‌ సంధించాడు. ఆఫ్‌సైడ్‌గా వేసిన బంతిని (15.1వ ఓవర్) అర్థం చేసుకోవడంలో విఫలమైన బట్లర్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. కనీసం, ఆ బంతిని ఎలా ఆడాలనేది కూడా బట్లర్‌కు అర్థం కాలేదంటే అతిశయోక్తి కాదు.
  • మొయిన్‌ అలీ (15): వరుసగా వికెట్ల పడిన తర్వాత క్రీజ్‌లో పాతుకుపోయి లివింగ్‌స్టోన్‌తో కలిసి భాగస్వామ్యం నిర్మిస్తూ భారత బౌలర్లకు ఇబ్బందిగా మారాడు అలీ. కానీ, మరో స్పెల్‌ బౌలింగ్‌కు (23.1వ ఓవర్) వచ్చిన షమీ తన తొలి బంతికే వికెట్‌ను తీశాడు. లెంగ్త్‌లో పడిన బంతిని ఆడే క్రమంలో మొయిన్‌ అలీ వికెట్‌ కీపర్‌ కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు.
  • క్రిస్‌ వోక్స్‌ (10).. అప్పటివరకు పరుగులు నియంత్రిస్తూ వచ్చిన రవీంద్ర జడేజా వికెట్‌ కూడా సంపాదించాడు. ప్లైటెడ్‌ డెలివరీని (28.1వ ఓవర్) సంధించి భారీ షాట్‌ కొట్టేలా క్రిస్‌ వోక్స్‌ను ఊరించాడు. అయితే, టర్న్‌ను అంచనా వేయడంలో వోక్స్‌ మిస్‌ అయి కీపర్‌ రాహుల్‌ చేతిలో స్టంపౌట్ అయ్యాడు.
  • లివింగ్‌స్టోన్‌ (27).. లోయర్‌ ఆర్డర్‌లో డేంజరస్‌ బ్యాటర్ అయిన లివింగ్‌స్టోన్‌ క్రీజ్‌లో ఉండటంతో ఇంగ్లాండ్‌కు విజయంపై ఇంకా అక్కడక్కడా ఆశలు ఉన్నాయి. కానీ, కుల్‌దీప్‌ వేసిన బంతిని (29.2వ ఓవర్) అంచనా వేయడంలో విఫలమైన లివింగ్‌స్టోన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఇంగ్లాండ్‌ ఓటమి ఖరారైంది.
  • అదిల్‌ రషీద్‌ (13).. రెండు బౌండరీలతో ఓటమి అంతరాన్ని తగ్గించిన రషీద్‌... షమీ సూపర్ డెలివరీకి (33.6వ ఓవర్) సమాధానం చెప్పలేకపోయాడు. క్లీన్‌ బౌల్డ్‌ అయ్యి.. షమీకి నాలుగో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు.
  • మార్క్‌వుడ్ (0): చివరి బ్యాటర్‌ మార్క్‌వుడ్‌ను బుమ్రా తన ట్రేడ్‌ మార్క్‌ యార్కర్‌తో (34.5వ ఓవర్) క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఇది మ్యాచ్‌లో బుమ్రాకు మూడో వికెట్‌.

ABOUT THE AUTHOR

...view details