ODI World Cup 2023 Hardik Pandya : టీమ్ఇండియాకు, క్రికెట్ అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్‌లో ఇప్పటికే గాయంతో జట్టుకు దూరమైన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Injury Update).. ఇప్పుడు మిగతా మ్యాచ్‌లకు కూడా దూరం కానున్నట్లు క్లారిటీ అయిపోయింది. హార్దిక్ త్వరగా కోలుకుని మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడనుకుంటే అది జరగలేదు. హార్దిక్ ఇంకా కోలుకోకపోవడంతో విశ్రాంతి ఇచ్చి.. అతడి స్థానంలో ప్రసిద్ధ కృష్ణను తీసుకున్నట్లు ఐసీసీ నిర్వహకులు అధికారికంగా ప్రకటించారు.
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతిని ఆపే క్రమంలో హార్దిక్ గాయపడిన సంగతి తెలిసిందే. చీలమండ గాయం కావడం వల్ల అతడు చికిత్స కోసం జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లిపోయాడు. దీంతో మొదటగా.. మూడు మ్యాచ్‌లకు అతడు దూరమవుతాడని మేనేజ్‌మెంట్ చెప్పింది. కానీ గాయం తీవ్రత తగ్గకపోవడంతో ఇప్పుడు అతడికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు.
"ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్ ఇండియాకు బ్యాడ్ న్యూస్. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య చీలమండ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో టోర్నీలోని మిగతా మ్యాచ్‌లకు అతడు దూరం కానున్నాడు. పాండ్య ప్లేస్‌లో ప్రసిధ్ కృష్ణను జట్టులోకి తీసుకున్నాం." అని ఐసీసీ అనౌన్స్ చేసింది. ఇక ఇదే విషయంపై హార్దిక్ కూడా స్పందించాడు. వరల్డ్ కప్‌లోని మిగతా మ్యాచ్‌లకు దూరం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. కానీ నేను జట్టుతో ఉంటాను. ప్రతి గేమ్ ప్రతి బంతి ఆడేటప్పుడు వారిలో ఉత్సాహపరుస్తూ జోష్ నింపుతాను" అని చెప్పుకొచ్చాడు.