ODI World cup 2023 Rashid Khan :వన్డే ప్రపంచకప్ - 2023లో భాగంగా తాజాగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ - అప్గానిస్థాన్ మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోరులో అప్గానిస్థాన్ టీమ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్‌తో ఆల్‌రౌండ్ షో చేసి.. జగజ్జేత ఇంగ్లాండ్‌కు గట్టి షాక్ ఇచ్చింది.
ODI World cup 2023 Rashid Khan : నాడు విలన్.. నేడు హీరో.. డిఫెండింగ్ ఛాంపియన్‌పై అదరగొట్టేశాడు! - వన్డే వరల్డ్ కప్ 2023
ODI World cup 2023 Rashid Khan : వన్డే ప్రపంచకప్ - 2023లో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌పై విజయం సాధించడంలో అప్గానిస్థాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. నాడు ఇంగ్లాండ్‌పై దారుణంగా దెబ్బ తిన్న అతడు ఇప్పుడు తన ప్రదర్శనతో హీరోగా మారాడు. ఆ వివరాలు..
Published : Oct 16, 2023, 11:03 AM IST
అయితే ఇంగ్లాండ్‌పై అప్గానిస్థాన్ సంచలన విజయాన్ని అందుకోవడంలో స్పిన్ ఆల్‌రౌండర్లు ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. ఈ ఇద్దరు మొదట బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించారు. కీలక పరుగులు చేశారు. ఆ తర్వాత బంతితోనూ మ్యాజిక్ చేశారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ విజయంలో రషీద్ ఖాన్ పాత్ర, ప్రదర్శన ప్రశంసనీయం అనే చెప్పాలి.
ఎందుకంటే గత ప్రపంచ కప్‌లో ఇదే ఇంగ్లాండ్ చేతిలో అతడు ఘోరంగా దెబ్బతిన్నాడు. ఇప్పుడేమో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. 2019 ప్రపంచ కప్‌లో నాటి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 71 బంతుల్లో 4 ఫోర్లు, 17 సిక్సర్లు సాయంతో 148 విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతడి దెబ్బకు రషీద్ బలయ్యాడు. 9 ఓవర్లలో ఏకంగా 110 పరుగులు సమర్పించుకుని... కెరీర్‌లోనే చెత్త బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. అతి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అప్పుడు తన జట్టుకు విలన్ అయ్యాడు! కానీ ఇప్పుడదే ఇంగ్లాండ్ జట్టు పతనాన్ని శాసించి.. తమ టీమ్‌కు హీరోగా నిలిచాడు.