ODI World Cup 2023 Afghanisthan :ఈ ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ సంచలన విజయాలను నమోదు చేయడం ప్రారంభించింది. మొదట డిఫెండింగ్ ఛాంపియన్, ఈ ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్‌ను(afghanistan england cricket match) మట్టికరిపించి సంచలనం సృష్టించింది. ఇంకా ఆ సెన్సేషన్ విజయం గురించి క్రికెట్ అభిమానులు మాట్లాడుకోవడం మానలేదు. అంతలోనే.. ఊహించని విధంగా మరో సంచలన విజయంతో చరిత్ర సృష్టించింది అఫ్గాన్. తాజాగా వరల్డ్ క్లాసింగ్ బౌలింగ్, టాప్ బ్యాటర్లు ఉన్న పాకిస్థాన్(afghanistan pakistan world cup match) జట్టును చిత్తుగా ఓడించింది. జట్టులో ఎంతో కసి ఉంటే కానీ ఇలాంటి విజయాలు రావని చెప్పాలి. అయితే ఈ కసి వెనక కన్నీళ్ల గాథలు ఉన్నాయి. అయినా గుండె నిబ్బరం చేసుకుని జట్టు సమిష్టిగా రాణిస్తోందంటే.. హ్యాట్సాఫ్ తప్పక అనాల్సిందే.
అంత తేలిక కాదు..గత కొన్నేళ్లుగా అఫ్గాన్ జట్టు ప్రదర్శన చూస్తున్న వారికి.. ఈ వరల్డ్‌కప్‌లో వారి ప్రదర్శన చూస్తే... ఇవేవో అనుకోకుండా వచ్చిన విజయాల్లా అస్సలు కనిపించవు. ఎందుకంటే ఆ దేశ ప్లేయర్స్ ఎలాంటి స్థితిలో వరల్డ్ కప్‌లో అడుగు పెట్టారో తెలిస్తే, అసలు వాళ్ల దేశంలో ఏం జరుగుతోందో తెలిస్తే... వారు సాధించిన విజయాలు అంత తేలికైనవి కాదని తెలుస్తుంది. ఆ జట్టుపై అభిమానం మరింత ఎక్కువ పెరుగుతుంది.
కొన్ని రోజుల క్రితం అఫ్గాన్‌లో భూకంపం(afghanistan earthquake 2023) కుదిపేయడంతో ఏకంగా 3 వేల మందికి పైగా ప్రాణాలను విడిచారు. అంతకుముందు రెండేళ్ల కిందట తాలిబన్ల చేతుల్లోకి ఆ దేశం వెళ్లిపోవడం వల్ల.. పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. కేవలం ఆర్థికంగా మాత్రమే కాదు.. అన్ని రకాలుగా ఆ దేశం బాగా చితికిపోయింది. తీవ్ర కష్టాల్లోకి వెళ్లిపోయింది. అమెరికాతో పాటు ఇతర దేశాల నుంచి అఫ్గాన్‌కు ఆర్థిక సాయం ఆగిపోయింది. ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఈ మధ్య సంభవించిన భూకంపం మరింత తీవ్రంగా నష్టం కలిగించింది.
బాధను దిగమింగుకుని.. గుండె నిబ్బరంతో... ఇకపోతే అఫ్గాన్ దేశం తాలిబన్ల(afghanistan taliban crisis) చేతిలోకి పూర్తిగా వెళ్లిపోయాక.. ఆ దేశ క్రికెటర్లు ఎక్కువగా విదేశాల్లోనే ఉండటం మొదలుపెట్టారు. జాతీయ జట్టు తరపున ఏదైనా సిరీస్ లేదా టోర్నీ ఆడాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఒక చోట చేరుతున్నారు. మిగతా సమయాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర టీ20, టీ20 లీగ్స్ ఆడుతూ గడిపేస్తున్నారు. తమ కుటుంబానికి చెందిన వారిని కూడా దుబాయ్ సహా ఇతర దేశాలకు తరలించేశారు. కానీ వారికి సంబంధించిన చాలా మంది బంధువులు, సన్నిహితులు అఫ్గానిస్థాన్‌లోనే ఉన్నారు.
అయితే రీసెంట్గా సంభవించిన భూకంపంలో.. తమకు సంబంధించిన చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. నిరాశ్రులైపోయారు. అలాంటి పరిస్థితిలో బాధను దిగమింగుకుని.. ఆ జట్టు వరల్డ్ కప్ 2023లో అడుగు పెట్టింది. ఎంతో కసి, బాధను గుండెల్లోనే ఉంచుకుని.. దిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసి మేటి జట్టైన ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది.