ODI World Cup 2023 AFG vs IND :వరల్డ్ కప్‌లో భాగంగాటీమ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో అప్గానిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 50 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. రెహ్మనుల్లా గుర్బాజ్ (21), ఇబ్రహీం జాద్రాన్ (22), రహమత్ షా (16) తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (80; 88 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (62; 69 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును కాస్త ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిగతా వారు నామమాత్రపు పరుగులు చేశారు. మహ్మద్ నబీ (19), రషీద్‌ఖాన్ (16), ముజీబుర్ రెహ్మన్ (10*), నవీనుల్ హక్ (9*) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్య 2, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.
బుమ్రా వేసిన తొలి ఓవర్‌లో వైడ్ రూపంలో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. 28 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేసిన ఇబ్రహీం.. బుమ్రా బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
28 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 21 పరుగులు చేసిన రెహ్మనుల్లా గుర్భాజ్, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో బౌండరీ లైన్ దగ్గర శార్దూల్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 22 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేసిన రెహ్మాత్ షా కూడా శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
దీంతో 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది అప్గానిస్థాన్. ఆ సమయంలో అజ్మతుల్లా ఒమర్జాయ్, ఆప్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది కలిసి నాలుగో వికెట్‌కు 128 బంతుల్లో 121 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 69 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసిన అజ్మతుల్లా ఓమర్‌జాయ్‌ను హార్దిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు..