ODI World Cup 2023 AFG vs IND :ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఓ అరుదైన ఘనత అందుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ మ్యాచుల్లో టీమ్ ఇండియా తరఫున అలాగే ఓవరాల్‌గా ఫాసెస్ట్ 1000 పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. 19 ఇన్నింగ్స్‌లో ఈ మార్క్‌ను అందుకున్నాడు. రీసెంట్గా ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఈ ఘనత సాధించాడు.
ఇంకా ఈ మ్యాచ్‌తో మరో రికార్డ్‌ను కూడా అందుకున్నాడు హిట్ మ్యాన్. అన్నీ ఫార్మట్లలో కలిసి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్స్‌ల రికార్డ్‌ను నమోదు చేశాడు. 473 ఇన్నింగ్స్‌లో 554 సిక్సర్లతో ఈ మార్క్‌ను టచ్ చేశాడు. ఆ తర్వాత 551 ఇన్నింగ్స్‌లో 553 సిక్స్‌లతో క్రిస్‌గేల్ ఉన్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ తన 53వ అర్ధశతకాన్ని నమోదు చేసిన రోహిత్ శర్మ.. ఈ రికార్డును నమోదు చేశాడు రోహిత్. దీంతో పాటే 2023 వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు 93 మీటర్ల భారీ సిక్స్‌తో రోహిత్ మొదటి స్థానంలో నిలిచాడు.
సచిన్ రికార్డ్ బ్రేక్.. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma World Cup Century) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 63 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకుని వరల్డ్ కప్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలోనే ప్రపంచకప్‌లో ఏడో సెంచరీ ఖాతాలో వేసుకుని రోహిత్.. సచిన్(6) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.