ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమ్ఇండియాలో అశ్విన్ లాంటి స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు న్యూజిల్యాండ్ ఆటగాడు కాన్వే సరికొత్త వ్యూహంతో సిద్ధమవుతున్నాడు. పిచ్‌పై కిట్టీ లిట్టర్(కుక్క, పిల్లి వ్యర్థాలు)ను జల్లి శిక్షణ చేస్తున్నట్లు తెలిపాడు.
"టీమ్ఇండియాను ఎదుర్కొనేందుకు కొత్త టెక్నిక్‌ను అనుసరిస్తున్నాను. కిట్టీ లిట్టర్ పిచ్‌పై ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇది కఠినంగా ఉంటుంది. బంతి బాగా టర్న్ అవుతుంది. దీంతో ఆడటం కాస్త కష్టంగా ఉన్నా.. మంచి ప్రాక్టీస్ లభిస్తుంది. ఇది కేవలం నా గేమ్‌ప్లాన్‌లో భాగం మాత్రమే" అని అన్నాడు.