NZ vs SL World Cup 2023 :2023 వరల్డ్‌కప్ సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ సత్తా చాటింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో శ్రీలంకను వికెట్ల తేడాతో చిత్తు చేసింది. శ్రీలంక నిర్దేశించిన 172 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని.. కివీస్ 23.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు డేవన్ కాన్వె (45 పరుగులు), రాచిన్ రవీంద్ర (42), డారిల్ మిచెల్ (43) రాణించారు. లంక బౌలర్లలో ఏంజిలో మాథ్యూస్ 2, దుశ్మంత చమీర, మహీష తీక్షణ తలో వికెట్ దక్కించుకున్నారు. అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో కివీస్ 10 పాయింట్లతో సెమీస్‌కు మరింత దగ్గరైంది. కానీ, కివీస్ అధికారికంగా సెమీస్‌లో అడుగుపెట్టాలంటే.. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్ల చివరి మ్యాచ్ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
172 పరుగుల స్పల్ప లక్ష్య ఛేదనను కివీల్ ఘనంగా ప్రారంభించింది. ఓపెనర్లు కాన్వే, రాచిన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. దీంతో కివీస్ 10 వికెట్ల విజయం నమోదు చేస్తుందనున్నారంతా. కానీ, బౌలర్ చమీర 12.2 ఓవర్ల వద్ద కాన్వే వికెట్ పడగొట్టి శ్రీలంకకు తొలి బ్రేక్ ఇచ్చాడు. తొలి వికెట్‌కు వీరు 86 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఓవర్లోనే రాచిన్ కూడా ఔటయ్యాడు. కెప్టెన్ విలియమ్సన్ (14), మార్క్ చాప్మన్ (7) త్వరగానే పెవిలియన్ చేరారు. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్ (14*) కివీస్‌ను విజయతీరాలకు చేర్చాడు.