IND Vs NZ T20 : టీ20 ప్రపంచకప్ రెండో సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం తర్వాత టీమ్‌ఇండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ కివీస్‌తో మూడేసి టీ20లు, వన్డేలు ఆడనుంది. టీ20 సిరీస్ నవంబర్ 18 నుంచి 22 వరకు, వన్డే సిరీస్ 25 నుంచి 30 వరకు జరగనుంది. తొలి టీ20 వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీలకు విశ్రాంతినిచ్చి పలువురు యువ క్రికెటర్లను జట్టులోకి తీసుకున్నారు. మరి శుక్రవారం జరిగే తొలి టీ20 కోసం టీమ్‌ఇండియా తుది జట్టులో ఎవరెవరు ఉంటారనే దానిపై పలువురు క్రికెట్ విశ్లేషకులు తమ తమ అంచనాలను వెలువరుస్తున్నారు.
ఓపెనర్లుగా ఇషాన్, శుభమన్ గిల్!
టీమ్‌ఇండియా యువ సంచలనం ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించే అవకాశముంది. ఇషాన్ గత కొంతకాలంగా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ యువ బ్యాటర్ భారత్ తరఫున ఇప్పటివరకు 19 టీ20లు ఆడి 131.15 స్ట్రైక్‌రేట్‌తో 543 పరుగులు చేశాడు. శుభమన్ గిల్ ఈ సిరీస్‌తో టీ20ల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. ఇషాన్‌కు తోడుగా గిల్ ఓపెనర్‌గా పంపే అవకాశముంది. మూడో స్థానంలో శ్రేయస్ అయ్యర్, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగొచ్చు.
వికెట్ కీపర్‌గా వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఆరో స్థానంలో సంజూ శాంసన్, ఏడో స్థానంలో ఆల్‌రౌండర్, కెప్టెన్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్ చేయొచ్చు. బౌలింగ్ విషయానికొస్తే.. సీనియర్ లెగ్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్‌కు తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. పేస్ విభాగంలో భువనేశ్వర్ కుమార్‌కు తోడుగా యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లను తీసుకునే అవకాశముంది.
భారత్ తుది జట్టు (అంచనా)
ఇషాన్ కిషన్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య, యుజేంద్ర చాహల్,భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
కివీస్-భారత్ పోరులో గత రికార్డులు ఇలా..
- మ్యాచ్‌లు: 20
- భారత్ విజయం సాధించినవి: 11
- న్యూజిలాండ్ గెలిచినవి: 9
- భారత్‌పై న్యూజిలాండ్ అత్యధిక స్కోరు: 219/6 (2019లో)
- టీమ్‌ఇండియా అత్యధిక స్కోరు: 208/6 (2019లో)
- టీమ్‌ఇండియా అత్యల్ప స్కోరు: 79 (2016లో)
- కివీస్ అత్యల్ప స్కోరు: 111(2021లో)
- అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడు: రోహిత్ శర్మ (511)
- అత్యధిక పరుగులు చేసిన కివీస్ ఆటగాడు: మున్రో (426)
- ఎక్కువ వికెట్లు తీసిన న్యూజిలాండ్ బౌలర్: ఇష్ సోథి (20)
- ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్: జస్ప్రీత్ బుమ్రా (12)
- ఇదీ చదవండి:
- కళ్లు చెదిరే ఫీల్డింగ్.. క్యాచ్ పట్టి ఉంటే..
- Surya kumar yadav ఏయ్ పిల్లా నువ్వు లేకపోతే ఏమైపోయేవాడినో