NZ vs BAN Test: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. కివీస్ గడ్డపై ఇప్పటివరకూ ఏ ఫార్మాట్లోనూ ఒక్క మ్యాచ్ కూడా గెలవని బంగ్లా.. ఇప్పుడు ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం చెలాయిస్తోంది. కెప్టెన్ మొమినుల్ హక్ (88; 244 బంతుల్లో), వికెట్ కీపర్ లిటన్ దాస్ (86; 177 బంతుల్లో) రాణించడం వల్ల తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌పై 130 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం బంగ్లా బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడుతోంది. నాలుగో రోజు ఆటముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది కివీస్. చివరిదైన ఐదో రోజు ప్రత్యర్థిని తొందరగా ఆలౌట్ చేసి బ్యాటింగ్‌కు దిగితే బంగ్లాకు విజయం దక్కొచ్చు.
కివీస్‌పై బంగ్లా ఆధిక్యం.. చారిత్రక విజయానికి అడుగు దూరంలో! - కివీస్‌పై బంగ్లా ఆధిక్యం
NZ vs BAN Test: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పట్టుబిగించింది బంగ్లాదేశ్. కివీస్ గడ్డపై చారిత్రక విజయానికి కొద్ది దూరంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన బంగ్లా ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ను 328 పరుగులకే ఆలౌట్ చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో కాన్వే (122) సెంచరీతో మెరవగా నికోలస్ (75), విల్ యంగ్ (52) ఆకట్టుకున్నారు. తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 458 పరుగులకు ఆలౌటైంది. మొమినుల్ (88), లిటన్ దాస్ (86), మహ్మదుల్ హసన్ (78), షంటో (64) రాణించారు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాకు 130 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. విల్ యంగ్ (69) ఒక్కడే ఆకట్టుకున్నాడు. క్రీజులో రాస్ టేలర్ (37*), రచిన్ రవీంద్ర (6*) ఉన్నారు. ప్రస్తుతం కివీస్ 17 పరుగుల ఆధిక్యంలో ఉంది.