న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ ఫెర్గూసన్(Ferguson NZ Cricket) టీ20 ప్రపంచకప్ టోర్నీకి దూరమైనట్లు కివీస్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. కాలి పిక్కలో చీలిక కారణంగా అతడు టోర్నీకి దూరమైనట్లు పేర్కొంది. మంగళవారం పాకిస్థాన్‌తో(NZ vs PAK t20) మ్యాచ్‌కు ముందు ఈ ప్రకటన చేసింది.
"గత రాత్రి ట్రైనింగ్ అనంతరం ఫెర్గూసన్ కుడి కాలు పిక్క భాగంలో చీలిక ఏర్పడినట్లు తెలిసింది. దీంతో ఎమ్ఆర్ఐ స్కాన్ తీయగా.. అది గ్రేడ్ 2 స్థాయి గాయమని స్పష్టమైంది. గాయం మానేందుకు మూడు నుంచి నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి" అని న్యూజిలాండ్ క్రికెట్ వెల్లడించింది.
ఫెర్గూసన్ పిక్కలో చీలిక ఏర్పడడంపై ఆ జట్టు ప్రధాన కోచ్ గారీ స్టెడ్ స్పందించాడు. "టీ20 ప్రపంచకప్ టోర్నీ సమయంలో ఫెర్గూసన్‌కు ఈ గాయమవడం బాధాకరం. జట్టు సభ్యులపై కూడా దీని ప్రభావం ఉంటుంది. ఫెర్గూసన్ మంచి ఫామ్‌లో ఉన్న బౌలర్. ఇలాంటి పరిస్థితుల్లో అతడు జట్టుకు దూరం కావడం బాధాకరం" అని స్టెడ్ తెలిపాడు.