తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇప్పుడు మనం తండ్రులం.. మధురమైన జ్ఞాపకాలను కోరుకుందాం.. - kohli latest news

యువరాజ్​ తనకు పంపిన లేఖపై కోహ్లీ స్పందించాడు. యువీతో తనుకున్న అనుబంధాన్ని చెబుతూ, భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు.

kohli yuvraj singh
కోహ్లీ యువరాజ్ సింగ్

By

Published : Feb 23, 2022, 10:27 PM IST

తనను దిగ్గజ సారథిగా అభివర్ణిస్తూ టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ రాసిన లేఖకు విరాట్ కోహ్లీ స్పందించాడు. యువీ కోసం ఇన్‌స్టా వేదికగా విరాట్ భావోద్వేగ సందేశం పోస్ట్ చేశాడు. ఎల్లప్పుడూ మాకు స్ఫూర్తిగా నిలుస్తావని కోహ్లీ పేర్కొన్నాడు.

"యువీ.. నీ అద్భుతమైన భావవ్యక్తీకరణకు ధన్యవాదాలు. నా కెరీర్ మొదటి రోజు నుంచి మంచి అనుబంధం ఉన్న వ్యక్తి నుంచి వచ్చిన బహుమతి(గోల్డెన్‌ బూట్‌). దీనికి చాలా అర్థం ఉంది. క్యాన్సర్ బారిన పడి కోలుకుని మళ్లీ క్రికెట్‌ పునరాగమనం చేసిన తీరు అన్ని రంగాలలోని వారికి స్ఫూర్తిదాయకం. అదేవిధంగా మీ చుట్టూ ఉండే సన్నిహితుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఎల్లప్పుడూ ఉదారంగా ఉంటారని నాకు తెలుసు. ఇప్పుడు మనిద్దరం తండ్రులుగా ఉన్నాం. ఆనందం, మధురమైన జ్ఞాపకాలు పొందుపరుచుకోవాలని కోరుకుంటున్నా" అని యువీతో ఉన్న ఫొటోను, గోల్డెన్‌ బూట్‌ ఇమేజ్‌ను కోహ్లీ షేర్‌ చేశాడు. విరాట్-అనుష్క జంటకు గతేడాది వామిక జన్మించగా.. యువరాజ్‌-హేజల్‌ కీచ్‌ జోడీకి ఇటీవలే మగబిడ్డ పుట్టాడు.

దేశం గర్వించేలా చేయ్‌..

విరాట్‌ కోహ్లీకి టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ఓ భావోద్వేగ లేఖను నిన్న రాశారు. ఆటగాడిగా, వ్యక్తిగా కోహ్లీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు. తన పట్టుదల, కఠోర శ్రమ కారణంగా కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా యువతకు స్ఫూర్తిగా నిలిచాడని అన్నాడు. అతడి నుంచి మరిన్ని చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ చూడాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశాడు.

"నువ్వు నీలానే ఉంటావని, నీలానే ఆడతావని, ఇలాగే దేశం గర్వపడేలా చేస్తూనే ఉంటావని ఆశిస్తున్నా" అని అంటూ కోహ్లీ కోసం తాను రాసిన లేఖను, దాంతోపాటు గోల్డెన్‌ బూట్‌ను ట్విటర్‌లో యువీ ఉంచాడు.

ABOUT THE AUTHOR

...view details