తెలంగాణ

telangana

ETV Bharat / sports

నా కెరీర్‌లో అదొక్కటే అసంతృప్తి: ఝులన్‌ గోస్వామి - ఝులన్ గోస్వామి 200 వికెట్లు

భారత మహిళా జట్టు సీనియర్‌ పేసర్‌ ఝులన్‌ గోస్వామి తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంది. ఆ విషయంలో తనకు ఇప్పటికీ అసంతృప్తి మిగిలిపోయిందని చెప్పింది.

Jhulan goswami retirement
ఝులన్​ గోస్వామి రిటైర్మెంట్

By

Published : Sep 23, 2022, 8:24 PM IST

రెండు దశాబ్దాల పాటు సాగిన తన క్రికెట్‌ ప్రస్థానానికి భారత మహిళా జట్టు సీనియర్‌ పేసర్‌ ఝులన్‌ గోస్వామి వీడ్కోలు పలకనున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌తో ఆడనున్న మూడో వన్డే మ్యాచ్‌ ఆమెకు చివరిది కానుంది. ఈ తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంది. ఈ 20 ఏళ్లలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశామని తెలిపింది. అయినా మహిళా క్రికెట్‌ రూపురేఖలు మార్చాలన్న లక్ష్యంతోనే ప్రతి ఒక్కరం పనిచేశామని, ఈరోజు ఆ కల సాకారమైందని పేర్కొంది. ఒకప్పుడు భారత మహిళా క్రికెట్‌ అసోసియేషన్‌గా మొదలైన జట్టు అంచెలంచెలుగా ఎదగడంపై ఆమె హర్షం వ్యక్తం చేసింది.

"1997లో ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా జరిగిన మహిళల ప్రపంచ కప్‌ను తొలిసారి చూశా. దేశం కోసం ఆడాలన్న కల మొదటిసారి అక్కడే ఏర్పడింది. ఇంత సుదీర్ఘకాలం ఆడతానని మాత్రం నేనెప్పుడూ అనుకోలేదు. ఇది నాకు గొప్ప అనుభవం. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. ఎంతో నేర్చుకున్నా. అండర్‌ 19 రోజుల నుంచి మిథాలీతో మంచి అనుబంధం ఉంది. మహిళా క్రికెట్‌ రూపురేఖలు మార్చగలమని మాకు విశ్వాసం ఉండేది. ఈరోజు అది చేసి చూపించాం. మహిళా క్రికెట్‌ అసోసియేషన్‌గా మొదలై ఈరోజు బీసీసీఐ ఆధ్వర్యంలో పనిచేసేంత ఎత్తుకు మా జట్టు ఎదగడం సంతోషంగా ఉంది. మొదటి సారి బౌలింగ్‌ చేయడం, కెప్టెన్‌ చేతుల మీదుగా మైడెన్‌ ఇండియా క్యాప్‌ను అందుకోవడం నాకెంతో అపురూపమైన క్షణాలు. ఇప్పటివరకు రెండు ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో నేను ఆడాను. కానీ అందులో కనీసం ఒక్కటైనా గెలవలేకపోయామన్న అసంతృప్తి మాత్రం ఇప్పటికీ ఉంది. అయితే మహిళా జట్టు గ్రాఫ్‌ పెరిగింది. ఇప్పుడున్న అమ్మాయిలు దీనిని మరింత ముందుకు తీసుకువెళతారు" అని ధీమా వ్యక్తం చేసింది.

కాగా, 2002లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఝులన్‌.. నాలుగేళ్ల క్రితం టీ20లకు స్వస్తి పలికింది. ఆమె కెరీర్‌లో మొత్తం ఆరు వన్డే ప్రపంచకప్‌లకు ప్రాతినిధ్యం వహించింది. వన్డే ఫార్మట్లలో 200 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు 203 వన్డేలు ఆడిన ఈ సీనియర్‌ పేసర్‌ ఇప్పటివరకు 253 వికెట్లు పడగొట్టింది.

ఇదీ చూడండి:అందుకే.. మైదానంలో అంత కూల్​గా కనిపిస్తా: ధోనీ

ABOUT THE AUTHOR

...view details