Shubman Gill 2023 World Cup: తాను 2023 వన్డే ప్రపంచకప్ గురించి ఆలోచించడం లేదని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని జట్టుకు సహకారం అందించడంపై దృష్టి సారించానని టీమ్‌ఇండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పేర్కొన్నాడు. గిల్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ (50) అర్ధ శతకంతో రాణించగా.. వర్షం కారణంగా రద్దయిన రెండో వన్డేలో 45 పరుగులు చేశాడు. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం గిల్‌ను టాప్ ఆర్డర్‌లో ఆడిస్తే బాగుంటుందని పలువురు మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు. ఓపెనర్ స్థానం కోసం కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ వంటి ఆటగాళ్లతో గిల్ గట్టిపోటీని ఎదుర్కొంటున్నాడు. అయితే, ప్రపంచ కప్ అవకాశాల గురించి తాను పెద్దగా ఆలోచించడం లేదని ఈ యువ బ్యాటర్ వెల్లడించాడు.
'వన్డే ప్రపంచకప్ గురించి అస్సలు ఆలోచించడం లేదు.. వర్షాలు చికాకు తెప్పిస్తున్నాయి' - శుభమన్ గిల్
2023 వన్డే ప్రపంచకప్ గురించి ఆలోచించడం లేదని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని జట్టుకు సహకారం అందించడంపై తృష్టి సారించానని టీమ్‌ఇండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పేర్కొన్నాడు. వర్షాలు మ్యాచ్‌లను ప్రభావితం చేయడం ఇరుజట్ల ఆటగాళ్లకు, డబ్బులు చెల్లించే అభిమానులకు చికాకు తెప్పిస్తుందని అన్నాడు.
'నిజంగా నేను అంత దూరం (ప్రపంచకప్ గురించి) ఆలోచించడం లేదు. ఇప్పుడు నా దృష్టంతా నాకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపైనే ఉంది. ఈ సిరీస్ విషయంలోనూ అదే విధానాన్ని అనుసరిస్తున్నా. భారీ స్కోరులు చేసి జట్టుకు మంచి సహకారం అందించడానికి ప్రయత్నిస్తున్నా' అని గిల్ వివరించాడు. సీనియర్ జాతీయ జట్టుకు ఎంపిక కానప్పుడు లేదా విరామం ఇచ్చినప్పుడు ఆ ఖాళీ సమయాన్ని నైపుణ్యాలను పెంచుకోవడం కోసం దేశవాళీ క్రికెట్ ఆడతానని వెల్లడించాడు.
'మ్యాచ్‌లు రద్దవడం చికాకు తెప్పిస్తుంది'
వర్షాలు మ్యాచ్‌లను ప్రభావితం చేయడం ఇరుజట్ల ఆటగాళ్లకు, డబ్బులు చెల్లించే అభిమానులకు చికాకు తెప్పిస్తుందని శుభ్‌మన్ గిల్ అన్నాడు. క్రికెట్ మ్యాచ్‌ల్ని ఇండోర్ స్టేడియాల్లో నిర్వహించడం చెడు ప్రత్యమ్నాయమేమీ కాదని గిల్ తెలిపాడు. న్యూజిలాండ్‌లో టీమ్‌ఇండియా పర్యటనలో తొలి టీ20, రెండో వన్డే వర్షం కారణంగా రద్దవగా.. మూడో టీ20 ఫలితం డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా తేలింది. "ఇండోర్ స్టేడియంలో ఆటపై నిర్ణయం క్రికెట్ బోర్డులు తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మ్యాచ్‌లు వర్షంతో ప్రభావితమవడం మైదానంలోకి వెళ్లి వచ్చే ఆటగాడిగా, అభిమానులుగా చికాకు తెప్పిస్తుంది. చాలా నిరాశ కలిగిస్తుంది. మ్యాచ్‌లో ఎన్ని ఓవర్లు ఉంటాయో తెలియదు. ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించుకోవాలో అర్థంకాదు" అని గిల్ వ్యాఖ్యానించాడు. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ గురించి ఇప్పుడే ఆలోచించట్లేదని గిల్ చెప్పాడు. "అంత దూరం ఆలోచించట్లేదు. నాకు లభించే అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలన్నదే లక్ష్యం. జట్టు కోసం భారీగా పరుగులు రాబట్టాలని కోరుకుంటున్నా" అని గిల్ పేర్కొన్నాడు.