తెలంగాణ

telangana

By

Published : Feb 22, 2023, 6:46 PM IST

ETV Bharat / sports

WPL 2023: దీప్తి శర్మకు షాక్​.. యూపీ వారియర్స్​ కెప్టెన్​గా ఆసీస్​ బ్యాటర్​

భారీ మొత్తంలో వెచ్చించి మరీ దీప్తి శర్మను కొనుగోలు చేసిన యూపీ వారియర్స్​ టీమ్​.. ఆమెకు షాక్ ఇచ్చింది. ఆమెను కాదని ఆసీస్​ బ్యాటర్​కు పగ్గాలు అప్పగించింది.

UP warriorz captain for WPL 2023
UP warriorz captain for WPL 2023

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ మరి కొద్ది రోజులుగా ప్రారంభం కానుంది. రీసెంట్​గా ఆటగాళ్ల వేలం పాట కూడా జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవలే స్మృతి మంధానను కెప్టెన్​గా ఎంపిక చేసినట్లు ప్రకటించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ). ముంబయి ఇండియన్స్ టీమ్‌కు టీమ్​ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అండర్19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ షెఫాలీ వర్మ, గుజరాత్ జెయింట్స్​ టీమ్‌కు కెప్టెన్​గా యాష్లీ గార్డ్నర్​ లేదా బెత్​ మూనీ ఎంపికయ్యే అవకాశముంది.

ఇకపోతే యూపీ వారియర్స్ జట్టుకు భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తుందని క్రికెట్​ అభిమానులు ఆశించారు. కానీ సదరు ఫ్రాంచైజీ.. దీప్తి శర్మకు షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ అలిస్సా హీలీని సారథిగా ఎంచుకుంది. ఈ మేరకు అధికార ప్రకటన చేసింది. నిజానికి యూపీ వారియర్స్.. దీప్తి శర్మను ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో రూ.2.60 లక్షలకు కొనుగోలు చేసింది. ఇక ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సోఫీ ఎక్లెస్టోన్‌ను రూ.1.80 లక్షలు, భారత ఆల్‌రౌండర్ దేవికా వైద్యను రూ. 1.40 లక్షలు, ఆసీస్ ఆల్‌రౌండర్ తహిళా మెక్‌గ్రాత్‌ రూ.1.40 లక్షలు, సౌతాఫ్రికా బౌలర్ షబ్మం ఇస్మాయిల్ రూ. కోటి, ఆసీస్ ఆల్‌రౌండర్ గ్రేస్ హారీస్‌ రూ.75 లక్షలు, వికెట్ కీపర్ అలిస్సా హెలీని రూ.70 లక్షలకు కొనుగోలు చేసింది.. ఇంకా ఈ జట్టులో భారత సీనియర్ బౌలర్ రాజేశ్వరి గైక్వాడ్‌తో పాటు అండర్-19 టీ20 ప్రపంచకప్​ 2023 స్టార్స్​ శ్వేతా సెహ్రావత్, పర్శవీ చోప్రా కూడా ఉన్నారు. అయితే హెలీని కన్నా దీప్తి శర్మకే ఎక్కువ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో అందరూ దీప్తి శర్మనే కెప్టెన్ అవుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడది జరగలేదు.

ఇకపోతే ఈ లీగ్​లో యూపీ వారియర్స్​.. మార్చి 3న గుజరాత్ జెయింట్స్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత మార్చి 5న దిల్లీ క్యాపిటల్స్‌, మార్చి 8న ఆర్సీబీ, మార్చి 10న ముంబయి ఇండియన్స్‌తో మ్యాచులు ఆడనుంది. ఇక మార్చి 13న ఆర్సీబీతో రెండో మ్యాచ్, మార్చి 15న ముంబయి ఇండియన్స్‌తో, మార్చి 17న గుజరాత్ జెయింట్స్‌తో, మార్చి 20న దిల్లీ క్యాపిటల్స్​తో తలపడనుంది.

ఇదీ చూడండి:జట్టు నుంచి కేఎల్​ రాహుల్​ను తప్పించాలా?.. చాట్​జీపీటీ సమాధానమిదే

ABOUT THE AUTHOR

...view details