Vitality t20 blast : సాధారణంగా చాలామంది బ్యాటర్లు ఎక్కువగా ఫీల్డర్లకు క్యాచ్‌లు ఇచ్చి పెవిలియన్ బాట పడుతుంటారు. కొన్నిసార్లు బౌలర్‌కే నేరుగా క్యాచ్ ఇచ్చేసి ఔటవుతుంటారు. అయితే, నాన్‌స్ట్రెకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ వల్ల ఔటవ్వడం (క్యాచ్) బహుశా మీరు ఇప్పటివరకు ఎవరూ చూసుండరు. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ లీగ్‌లో ఈ అరుదైన సంఘటన జరిగింది. నాన్‌స్ట్రెకర్‌లో ఉన్న బ్యాటర్ కారణంగా స్ట్రెకింగ్‌లో ఉన్న బ్యాటర్ క్యాచ్ ఔట్ అయ్యాడు. మంగళవారం నాటింగ్‌హామ్‌షైర్, లీసెస్టర్‌షైర్ జట్ల మధ్య జరిగిన పోరులో ఈ ఆసక్తికర సన్నివేశం జరిగింది.
ఇలాంటి క్యాచ్ ఎప్పుడూ చూడలేదుగా! - వైటాలిటీ టీ20 బ్లాస్ట్ 2023 షెడ్యూల్
ఇంగ్లాండ్ వేదికగా జరగుతున్న టీ20 బ్లాస్ట్‌లో ఓ అద్భుతమైన సన్నివేశం జరిగింది. పోటా పోటీగా జరుగుతున్న ఆ మ్యాచ్లో పట్టిన ఓ క్యాచ్ ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ అదేంటంటే ?
ఇంతకీ ఏమైందంటే..
nottinghamshire vs leicestershire : లీసెస్టర్‌షైర్ ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్‌ను నాటింగ్‌హామ్‌షైర్ బౌలర్ స్టీవెన్ ముల్లానీ వేశాడు. తొలి బంతిని లీసెస్టర్‌షైర్ కెప్టెన్ కోలిన్ అకెర్మాన్ నేరుగా ఆడగా.. వేగంగా వచ్చిన ఆ బంతి బౌలర్ ముల్లానీ చేతిలో పడింది. కానీ, ఇంతలోనే పట్టుతప్పి బంతి గాల్లోకి ఎగిరి నాన్ స్ట్రెకింగ్ ఎండ్‌లో ఉన్న వియాన్ ముల్డర్‌కు తాకింది. దీంతో బౌలర్ వెంటనే అప్రమత్తమై ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. ముల్డర్ కొంచెం పక్కకు ఉంటే బౌలర్‌కు క్యాచ్ అందుకునే అవకాశం ఉండకపోయేది. ఇలా ఎంతో రసవత్తరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో నాటింగ్‌హామ్‌షైర్ 22 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లీసెస్టర్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులే సాధించగలిగింది.
సిక్సర్ బాల్‌ను క్యాచ్..
Sussex vs Hampshire t20 : ఇక ఇటీవలే మరో క్యాచ్ సంచలనాన్ని సృష్టించింది. వైటాలిటీ బ్లాస్ట్ టీ20 లీగ్‍లో ససెక్స్ జట్టు పేసర్ బ్రాడ్లీ కరీ.. ఓ అద్భుతమైన క్యాచ్ పట్టి అందరిని ఔరా అనిపించాడు. హాంపర్‌షైర్‍తో జరిగిన ఈ మ్యాచ్‍లో బ్రాడ్లీ కరీ పట్టిన క్యాచ్ సోషల్ మీడియాను ఓ రేంజ్లో షేక్ చేసింది. మ్యాచ్‍లో హ్యాంపర్‌షైర్ బ్యాట్స్‌మన్ బెన్నీ హోవెల్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. ఆ సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ససెక్స్ పేసర్ బ్రాడ్లీ కరీ.. క్యాచ్ పట్టేందుకు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. క్యాచ్ పట్టే క్రమంలో ఒక్కసారిగా ఎగిరి భారీ డైవ్ చేశాడు. అప్పుడే బంతిని ఎడమ చేతిలో ఒడిసి పట్టుకున్నాడు. అయితే సిక్సర్ వెళ్లే బంతిని భారీ డైవ్ కొట్టి.. ఓ సక్సెస్ఫుల్ క్యాచ్‍గా మలిచాడు. దీంతో స్టేడియమంతా దద్దరిల్లిపోయింది.