Ashes 4 th Test : యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టెస్టులో ఓటమిని చవి చూసిన ఆస్ట్రేలియా జట్టు.. నాలుగో మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న కసితో ఉంది. ఇందుకోసం తీవ్ర కసరత్తులు చేస్తున్న ఆసిస్ సేన.. నాలుగో టెస్టు ఆడే పదకొండు మంది జట్టు సభ్యుల పేర్లను ఒక రోజు ముందుగానే ప్రకటించింది. అయితే ఇందులో ఒక్క ప్రధాన స్పిన్నర్ కూడా లేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇలా స్పిన్నర్ లేకుండా ఆసీస్ జట్టు బరిలో దిగడం గత 11 ఏళ్లలో ఇదే తొలిసారి.
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ సమయంలో ఆస్టేలియా జట్టు స్పిన్నర్ నాథన్ లైయన్తీవ్రంగా గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడిన లైయన్.. ఆ తర్వాత బౌలింగ్ చేయడానికి మైదానంలోకి రాలేదు. కానీ జట్టుకు అవసరం అని తెలిసినప్పుడు చివర్లో బ్యాటింగ్‌కు దిగాడు. నొప్పి భరిస్తూనే జట్టుకు స్కోర్ అందించే ప్రయత్నం చేశాడు. ఇక హెడింగ్లే వేదికగా జరిగిన టెస్టులో టాడ్ మర్ఫీని ఆడించారు. కానీ అతనేం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో నాలుగో టెస్ట్ కోసం ఆసీస్ టీం మేనేజ్మెంట్ ఈ బలమైన నిర్ణయానికి దిగింది. అయితే జట్టులో ప్రధాన స్పిన్నర్ లేనప్పటికీ.. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ రూపంలో ఆ టీంలో ఇద్దరు పార్ట్ టైమ్ స్పిన్నర్లు ఉన్నారు.
England Vs Australia Test : మరోవైపు ఈ మ్యాచ్ జరగనున్న ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ పూర్తిగా పేస్ బౌలింగ్‌కు సహకరించేలా ఉంది. దానికితోడు ఇక్కడ వర్షం పడే అవకాశం కూడా ఉంది. దీంతో ఈ వేదికపై స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఆసీస్ టీం భావిస్తోంది. ఓ రకంగా అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం.