భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల కోసం ప్రత్యేకమైన డైట్ ప్లాన్ను రెడీ చేసింది బీసీసీఐ. అయితే ఇదికాస్తా బోర్డును చిక్కుల్లో పడేసింది. న్యూజిలాండ్తో జరగబోయే టెస్టు సిరీస్లో పాల్గొనే ఆటగాళ్లు, సిబ్బంది కోసం తయారు చేసిన డైట్ ప్లాన్లో.. వారందరూ హలాల్ సర్టిఫైడ్ మాంసాన్ని(halal meat india cricket) మాత్రమే తీసుకోవాలని చెప్పడమే ఇందుకు కారణం. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీంతో బీసీసీఐ విధానాన్ని తప్పుపడుతూ 'BCCI Promotes Halal'ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు.
ఓ స్పోర్ట్స్ వెబ్సైట్ ప్రకారం భారత ఆటగాళ్ల కోసం రూపొందించిన డైట్ మెనూలో హలాల్ మాంసం మాత్రమే ఉండాలని బోర్డు పేర్కొంది. వారి ఆహారంలో ఈ మాంసం తప్ప బీఫ్, ఫోర్క్లాంటివి అసలు ఉండరాదని స్పష్టం చేసింది.