Last IPL Mega Auction: వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం బీసీసీఐ త్వరలోనే మెగా వేలం ప్రక్రియను నిర్వహించనుంది. ఈ మేరకు మంగళవారం(నవంబర్ 30) అన్ని ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల(IPL 2022 Players Retained ) వివరాలను సమర్పించాలని కోరింది. 8 ఫ్రాంఛైజీలు.. ఒక్కో జట్టుకు నలుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకోవాలని నిబంధనలు కూడా రూపొందించింది బీసీసీఐ. ఈ నేపథ్యంలో మెగా వేలం మరింత ఆసక్తికరంగా మారింది. ఏ ఆటగాడిని రిటైన్ చేసుకోవాలో తెలియక ఫ్రాంఛైజీలు తర్జనభర్జన పడుతున్నాయి.
ఈ క్రమంలో ఓ నెటిజన్ చేసిన కామెంట్ వైరల్గా మారింది. 'బంపర్ అనౌన్స్మెంట్.. ఇదే చివరి ఐపీఎల్ మెగా ఆక్షన్' అంటూ కే శ్రీనివాస్ రావు అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అయితే.. నిజంగా ఇదే చివరి మెగా వేలం కానుందా అనే అనుమానం కూడా చాలా మందిలో మొదలైంది.