తెలంగాణ

telangana

ETV Bharat / sports

డీఆర్‌ఎస్‌ లేకుండానే ఆ అంతర్జాతీయ మ్యాచ్‌లు

మ్యాచ్​లో అంపైర్​ ఇచ్చిన నిర్ణయాలపై అభ్యంతరాలుంటే.. డీఆర్ఎస్​కు(డెసిషన్‌ రివ్యూ సిస్టమ్‌) వెళ్తుంటారు ఆటగాళ్లు. అయితే ఈ డీఆర్​ఎస్​ సౌకర్యాన్ని న్యూజిలాండ్​తో జరిగే సిరీస్​లో కల్పించలేకపోతున్నట్లు తెలిపారు పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు ప్రతినిధులు. అందుకు గల కారణాన్ని వివరించారు.

Pakistan
పాకిస్థాన్

By

Published : Sep 11, 2021, 6:57 AM IST

ఆధునిక క్రికెట్‌లో డీఆర్‌ఎస్‌ (డెసిషన్‌ రివ్యూ సిస్టమ్‌) ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంపైర్‌ ఇచ్చిన నిర్ణయంపై అభ్యంతరాలుంటే.. తరచూ డీఆర్‌ఎస్‌కు(DRS Cricket) వెళ్తుంటారు. అక్కడ సాంకేతిక అంశాల ఆధారంగా కచ్చితమైన సమాచారం మేరకు ఆయా బ్యాట్స్‌మెన్‌ ఔటో, నాటౌటో తేలుస్తారు. అందులో అంపైర్‌ డెసిషన్‌ అనేది మరో కీలకాంశం. అయితే, ఐసీసీ సభ్య దేశాలన్నీ తమ అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఈ డీఆర్‌ఎస్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఐసీసీ ఆమోదించిన డీఆర్‌ఎస్‌ సర్వీస్‌ ప్రొవైడర్లతోనే ఆ సదుపాయాన్ని వినియోగించుకోవాలి.

మరికొద్ది రోజుల్లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో(Pakistan vs New Zealand) ఆడే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఆ సదుపాయం కల్పించుకోలేకపోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ బోర్డు ప్రతినిధులే మీడియాకు చెప్పారు. సెప్టెంబర్‌ 17 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లకు డీఆర్‌ఎస్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఒకరు వివరణ ఇవ్వగా.. మరో అధికారి మాట్లాడుతూ ఈ సిరీస్‌లకు సంబంధించి పీసీబీ మీడియా ప్రసార హక్కులను ఆలస్యంగా విక్రయించడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని అన్నారు. అయితే, వచ్చెనెల లాహోర్‌లో ఇంగ్లాండ్‌తో జరగబోయే టీ20 మ్యాచ్‌లకు మాత్రం డీఆర్‌ఎస్‌ విధానం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:IND Vs ENG: టెస్టు రద్దుతో ఈసీబీకి నష్టమెంతో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details