తెలంగాణ

telangana

ETV Bharat / sports

బెయిర్​స్టో మెరుపు శతకం.. ఇంగ్లాండ్​దే రెండో టెస్ట్​ - బెయిర్​ స్టోక్స్​

England VS Newzland: న్యూజిలాండ్​తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్​ అద్భత విజయాన్ని అందుకుంది. ఆ జట్టు ఆటగాళ్లు బెయిర్​స్టో, స్టోక్స్​ ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడి గెలుపును అందించారు. ఫలితంగా ఇంగ్లీష్​ జట్టు.. మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకుంది.

England VS Newzland
ఇంగ్లాండ్​ వర్సెస్​ న్యూజిలాండ్​

By

Published : Jun 15, 2022, 7:01 AM IST

England VS Newzland: న్యూజిలాండ్‌తో రెండో టెస్టు.. ఇంగ్లాండ్‌ లక్ష్యం 299 పరుగులు..! 93 పరుగులకే 4 వికెట్లు పడిపోయాయి. అయినా ఆ జట్టు వదిలితేనా! టీ20 మ్యాచ్‌ను తలపిస్తూ చెలరేగిన బెయిర్‌స్టో (136; 92 బంతుల్లో 14×4, 7×6) మెరుపు సెంచరీతో ఇంగ్లాండ్‌కు సంచలన విజయాన్ని అందించాడు. బెయిర్‌స్టోకు తోడు స్టోక్స్‌ (75 నాటౌట్‌; 70 బంతుల్లో 10×4, 4×6) రాణించడం వల్ల ఇంగ్లిష్‌ జట్టు 5 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది. అంతేకాదు మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకుంది.

ఛేదనలో ఇంగ్లాండ్‌ 56 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా.. లీస్​తో(44) కలిసి బెయిర్‌స్టో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. లీస్‌ ఔటైనా స్టోక్స్‌ జతగా అతడు జట్టును విజయపథంలో నడిపించాడు. టీ సమయానికి 139/4తో ఉన్న ఇంగ్లాండ్‌ మరో 16 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించిందంటే బెయిర్‌స్టో-స్టోక్స్‌ ఎంతగా చెలరేగారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సిక్స్‌లతో హోరెత్తించిన బెయిర్‌స్టో 77 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. అతడు స్టోక్స్‌తో కలిసి అయిదో వికెట్‌కు 179 పరుగులు జోడించాడు. ఇంగ్లాండ్‌ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 224/7తో అయిదోరోజు, మంగళవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన కివీస్‌ 284 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ (62) రాణించాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో బ్రాడ్‌ (3/70), అండర్సన్‌ (2/20), పాట్స్‌ (2/32) ప్రత్యర్థిని కట్టడి చేశారు.న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 553 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్‌ 539 పరుగులు చేసింది.

ఇదీ చూడండి:బీసీసీఐకి జాక్​పాట్.. రూ.48,390 కోట్లకు ఐపీఎల్ మీడియా​ రైట్స్​

ABOUT THE AUTHOR

...view details