వన్డే సిరీస్‌ను ఓటమితో ప్రారంభించింది టీమ్‌ఇండియా. కివీస్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ప్రత్యర్థి జట్టు.. భారత జట్టు నిర్దేశించిన 307 పరుగుల లక్ష్యాన్ని 47.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ టామ్ లాథమ్ (145*: 104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్స్‌లు), కేన్ విలియమ్సన్ (94*: 98 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్) నాలుగో వికెట్‌కు 221 పరుగులు జోడించి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మిగతా బ్యాటర్లలో ఫిన్ అలెన్ 22, డేవన్ కాన్వే 24, డారిల్ మిచెల్ 11 పరుగులు చేశారు. భారత బౌలర్లు ఉమ్రాన్ మాలిక్ 2, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశారు.
తొలి వన్డే కివీస్‌దే.. టీమ్ఇండియాకు తప్పని ఓటమి - తొలి వన్డేలో న్యూజిలాండ్ విజయం
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 307 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
కాగా, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (50: 65 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్స్‌లు), శిఖర్ ధావన్ (72: 77 బంతుల్లో 13 ఫోర్లు)తోపాటు శ్రేయస్ అయ్యర్ (80: 76 బంతుల్లో 4 ఫోర్ల, 4 సిక్స్‌లు) అర్ధశతకాలతో అదరగొట్టారు. అయితే చివర్లో వాషింగ్టన్ సుందర్ (37: 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) విజృంభించాడు. రిషభ్ పంత్ (15), సూర్యకుమార్ (4) విఫలం కాగా.. సంజూ శాంసన్ (36) ఫర్వాలేదనిపించాడు. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ 3, టిమ్ సౌథీ 3, ఆడమ్ మిల్నే ఒక వికెట్ తీశారు.
ఇదీచూడండి:పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన క్రికెటర్ ప్రేయసి.. త్వరలోనే పెళ్లి!