ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో(WTC Final) టీమ్ఇండియా ఓటమి పాలయ్యాక కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)ని న్యూజిలాండ్‌కు చెందిన ఓ వెబ్సైట్ దారుణంగా అవమానించింది. కివీస్ పేసర్ కైల్ జేమీసన్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లీని ఔట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత సారథిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అతడు.. రెండోసారి ఔట్ స్వింగ్ బంతి వేసి వికెట్ల వెనుక కీపర్‌కు క్యాచ్ ఇచ్చేలా చేశాడు. దాంతో పలువురు నెటిజెన్లు కూడా కోహ్లీపై పలు మీమ్స్ రూపొందించి సరదాగా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అయితే, న్యూజిలాండ్‌కు చెందిన 'Thaccnz' అనే క్రీడా సమాచార వెబ్సైట్ ఒక అడుగు ముందుకేసి అత్యుత్సాహం ప్రదర్శించింది.
ఓ మహిళ ఒక పురుషుడిని తాడుతో కట్టేసి పట్టుకున్నట్లున్న ఫొటోను తీసుకొని, దానిపై ఆ వ్యక్తికి కోహ్లీ పేరు.. ఆ తాడు పట్టుకున్న మహిళకు జేమీసన్ పేరు పెట్టింది. అది చూడ్డానికి చాలా అవమానకరంగా ఉండటం వల్ల భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్లకున్న హుందాతనం.. అక్కడి ప్రసార మాధ్యమాలకు లేకపోయిందని తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాగైతే మరో ఖాతా చూసుకోవాల్సిందేనంటూ హెచ్చరిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
భారత అభిమానులు పెట్టిన కామెంట్లు..
* ఈ పోస్టు చేసినందుకు మీరు ఇప్పుడు ఇంకో బ్యాకప్ అకౌంట్ ఏర్పాటు చేసుకోవాలి.