తెలంగాణ

telangana

By

Published : Jan 28, 2023, 3:40 PM IST

ETV Bharat / sports

IND VS NZ: టీమ్​ఇండియాను ఓ ఆట ఆడేసుకున్నారుగా.. నవ్వులే నవ్వులు!

న్యూజిల్యాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత ఓటమిని చవి చూసింది. రాంచీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమై త్వరగా పెవిలియన్​ దారి పట్టారు. ఇలాంటి సమయంలో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కూడా ఔటై మ్యాచ్​లో విఫలమయ్యారు. దీంతో టీమ్​ఇండియా సోషల్​మీడియాలో ఫుల్​ ట్రోల్ అవుతోంది. అవీ మీకోసం..

india vs newzealand
india vs newzealand

రాంచీ వేదికగా శుక్రవారం జరిగిన ఇండియా వర్సెస్​ న్యూజిలాండ్​ తొలి టీ20లో కివీస్​ చేతిలో ఓటమిపాలైన టీమ్​ఇండియాపై ఫ్యాన్స్​ సోషల్​ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెటర్లపై మీమ్స్​ వర్షాన్ని కురిపిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు టీమ్​ఇండియా ప్లేయర్స్​పై వచ్చిన మీమ్స్​ను ఓ సారి లుక్కేద్దాం..

నో బాల్​ అర్షదీప్​..న్యూజిల్యాండ్‌తో జరిగిన తొలి టీ20లో అర్షదీప్ రంగంలోకి దిగాడు. గతంలో వచ్చిన ట్రోల్స్​కు ఫుల్​ స్టాప్​ పెడుతాడు అనుకుంటే అది జరగలేదు. చివరి ఓవర్ వేయడానికి వచ్చిన అర్షదీప్​పై ఫ్యాన్స్​ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే తొలి బంతికే నోబాల్ వేసి మరీ సిక్సర్ ఇచ్చిన అర్షదీప్ ఆ ఓవర్లో కివిస్​కు ఈజీగా 27 పరుగులు ఇప్పించాడు. దీంతో టీమ్​ఇండియా ఫ్యాన్స్​కు​ వచ్చిన కోపం అంతా ఇంతా కాదు. ఇక నెట్టింట అతన్ని ట్రోల్స్​ చేయడం మొదలెట్టారు. 'అసలు నువ్వు ఏం చేస్తున్నావురా నాయనా?' అంటూ కామెంట్లు పెడుతున్నారు. 'కేవలం 4 ఓవర్లలో 51 పరుగులు ఇవ్వడం అంటే మాటలు కాదు. ప్రత్యర్థిని గెలిపించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు' అంటూ తమ ఆగ్రహాన్ని ట్రోల్స్​ రూపంలో చూపిస్తున్నారు.

'టుక్ టుక్ అకాడమీ ప్రిన్సిపాల్' హార్దిక్​..మ్యాచ్​ ఆరంభంలోనే ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, శుభ్‌మన్ గిల్​లు పెవిలియన్​ దారి పట్టారు. ఇక సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలే శరణ్యం అని ఫ్యాన్స్​ ఆశించారు. సూర్య కుమార్​ కొంచెం మెరుగ్గా ఆడినప్పటికీ హార్దిక్ మాత్రం ఆ పని చేయలేదు. చాలా నెమ్మదిగా ఆడాడు. ఓ వైపు వాషింగ్టన్ సుందర్ వచ్చి భారీ షాట్లు ఆడుతున్నా పాండ్యా మాత్రం తన తీరు మాత్రం మార్చలేదు. ఈ మ్యాచ్‌లో పాండ్యా 20 బంతులు ఎదుర్కొని 21 పరుగులు మాత్రమే చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులు చేసి ఔటైన తర్వాత ఓవర్లోనే పాండ్యా కూడా పెవిలియన్ చేరాడు. టీ20 క్రికెట్‌లో ఇలాంటి ఇన్నింగ్స్ అవసరమా? అంటూ పాండ్యాను ట్రోల్​ చేయడం ప్రారంభించారు.

హార్దిక్ నిర్ణయంపై మండిపడుతున్న ఫ్యాన్స్..తొలి టీ20కి ముందు టీమిండియా ఓపెనర్లుగా ఎవరు వస్తారన్న ప్రశ్నకు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ పేర్లను సమాధానంగా చెప్పాడు కెప్టెన్ పాండ్యా. అయితే వాళ్లిద్దరూ తొలి టీ20లో దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా ఇషాన్ టీ20 ఫార్మాట్లో విఫలమవ్వడం కొనసాగుతూనే ఉంది.

విఫలమైన ఓపెనర్ల జంట..గిల్ అయితే వన్డేల్లో అద్భుతంగా ఆడాడు కానీ టీ20లో పేలవ ప్రదర్శన చేశాడు. ఈ ఫార్మాట్లో మంచి ఓపెనింగ్ ఇవ్వడంలో విఫలమైన గిల్​.. అంతకుముందు శ్రీలంకపై కూడా గిల్​, ఇషాన్ జోడీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ సిరీస్​లోని తొలి మ్యాచ్‌లో ఇషాన్ 30+ స్కోరు చేయగా..ఆ తర్వాత రెండు మ్యాచుల్లో 5 పరుగులు కూడా చేయలేదు. ఇక గిల్ అయితే తొలి రెండు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోరు చేశాడు. మూడో వన్డేలో 46 పరుగులు స్కోర్​ చేశాడు.

టీమ్​ఇండియా ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో పృథ్వీ షాను కివీస్ సిరీస్‌కు సెలెక్టర్లు ఎంపిక చేశారు. సరైన ఓపెనర్లు లేని టీమ్​ఇండియాకు పృథ్వీ ఎంపిక ఓ రైట్​ ఛాయిస్​ అని భావించారు. కానీ పాండ్యా, టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం షా ను పక్కన పెట్టేశారు. ఇక కివీస్‌తో జరిగిన టీ20లోనూ గిల్, కిషన్ జంట పేలవ ప్రదర్శన చూపెట్టి త్వరగానే పెవిలియన్ దారి పట్టారు. కిషన్ చాలా త్వరగా ఔట్​ అవ్వడంతో కొత్త ఆటగాడు రాహుల్ త్రిపాఠిపై తీవ్రమైన ఒత్తిడి పడింది. దాన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయిన త్రిపాఠి కూడా త్వరగానే మైదానం నుంచి బయటకి వచ్చేశాడు.

పృథ్వీని టీమ్​లోకి ఎంచుకోకపోవడం వల్లే ఇదంతా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.'చూస్తున్నావా సాయిబాబా?' అంటూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో తను అద్భుతంగా రాణించినప్పటికీ టీమిండియా నుంచి పిలుపు రాకపోవడంతో పృథ్వీ షా తన సోషల్ మీడియాలో ఇలాంటి మెసేజ్ పెట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో వైరలైన ఈ విషయాన్ని మరోసారి నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. ఇకనైన మిగతా మ్యాచుల్లో పృథ్వీ షాను ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details