న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు, వన్డే సిరీస్‌లకు దాయాది దేశం పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో భాగంగా ఈ ఇరుజట్లు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడనున్నాయి. దీంట్లో భాగంగా కరాచీలో తొలి టెస్టు ఆడుతున్న కివీస్ జట్టు మ్యాచ్ ఆరంభంలోనే అరుదైన ప్రపంచ రికార్డును నమోదు చేసింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ సారథి టిమ్ సౌతీ బౌలింగ్‌తో మ్యాచ్‌ను ఆరంభించాడు. ఈ క్రమంలో నాలుగో ఓవర్లో బంతి అందుకున్న అజాజ్ పటేల్.. తన స్పిన్‌తో మాయాజాలం చేశాడు. అజాజ్ వేసిన బాల్‌ను అంచనా వేయడంలో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(7) విఫలం కాగా.. వికెట్ కీపర్ టామ్ బ్లండల్ అతడిని స్టంపౌట్ చేశాడు.
న్యూజిలాండ్ అరుదైన రికార్డు.. 145 ఏళ్ల టెస్టు చరిత్రలో తొలిసారి.. - టామ్ బ్లాండెల్ స్టంప్ఔట్స్
పాకిస్థాన్‌తో తలపడుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ అరుదైన ఘనతను సాధించింది. 145 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా రికార్డు సృష్టించింది. అదేంటంటే?
145 ఏళ్లలో మొదటిసారి!
మరోవైపు, ఏడో ఓవర్ మొదటి బంతికి బ్రాస్‌వెల్ బౌలింగ్‌లోనూ వన్‌డౌన్ బ్యాటర్ షాన్ మసూద్(3)ను ఇదే రీతిలో బ్లండల్ స్టంపౌట్ చేసి వెనక్కి పంపించాడు. ఈ స్టంపౌట్‌తో ప్రపంచ రికార్డు నమోదైంది. 145 ఏళ్ల పురుషుల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా తొలి రెండు వికెట్లు స్టంపౌట్ ద్వారా తీయడం ఇదే మొదటిసారి కాగా.. మొతంగా రెండోసారి. 1976లో ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య జమైకాలో జరిగిన టెస్టులో తొలిసారి ఈ రికార్డు నమోదైంది. ఇందులో మూడు స్టంపౌట్లే ఉండటం విశేషం.