ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్(WTC final) ముంగిట ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడడం న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశమనేనని భారత బ్యాట్స్‌మన్ ఛెతేశ్వర్ పుజారా(Pujara) అన్నాడు. అయితే తమకు లభించిన కొద్ది సమయంలోనే ఫైనల్‌కు భారత్ మెరుగ్గా సన్నద్ధమవుతుందని చెప్పాడు.
Pujara: సమయం లేకున్నా.. సత్తా ఉంది! - టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్
టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్(WTC final)కు ముందు ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడడం న్యూజిలాండ్(ENG vs NZ) జట్టుకు కలిసొచ్చే అంశమని టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ ఛెతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) అన్నాడు. అయితే తమ జట్టుకు ప్రాక్టీసు చేసేందుకు తగిన సమయం లేకున్నా తుదిపోరులో మెరుగ్గా ప్రదర్శన చేయగలదని ఆశాభావం వ్యక్తం చేశాడు.
![Pujara: సమయం లేకున్నా.. సత్తా ఉంది! New Zealand will have an advantage, says Cheteshwar Pujara](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12123621-734-12123621-1623632620017.jpg)
"ఫైనల్‌కు ముందు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడడం న్యూజిలాండ్‌కు నిస్సందేహంగా లాభించే అంశమే. కానీ మేం మా అత్యుత్తమ ప్రదర్శన చేస్తాం. బాగా ఆడి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకునే సత్తా మా జట్టుకు ఉందని మాకు తెలుసు. ఇంగ్లాండ్‌లో ఒకే రోజు పరిస్థితులు భిన్న రకాలుగా ఉంటాయి. వాటికి అలవాటు పడటమే మాకు పెద్ద సవాలు. వర్షం పడుతుంది. మనం మైదానాన్ని వీడి వెళ్లగానే ఉన్నట్లుండి చినుకులు ఆగిపోతాయి. మళ్లీ వెంటనే తిరిగి రావాలి. ఈ విరామాల మధ్య ఆడటానికి మానసికంగా ఎంతో బలంగా ఉండాలి". అని పుజారా అన్నాడు.