ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ముందు పర్యటక న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మోచేతి గాయం కారణంగా కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్వ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. టామ్ లాథమ్ జట్టును ముందుండి నడిపించనున్నాడు.
ENG vs NZ: విలియమ్సన్ ఔట్.. లాథమ్‌కు పగ్గాలు - టామ్ లాథమ్
ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు నుంచి కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వైదొలిగాడు. మోచేతి గాయం కారణంగా అతడు ఈ మ్యాచ్ నుంచి తప్పుకొన్నాడు. కేన్ స్థానంలో లాథమ్ జట్టును నడిపించనున్నాడు.
కేన్ విలియమ్సన్, కివీస్ కెప్టెన్
ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు ముందు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది న్యూజిలాండ్. చూపుడు వేలు గాయంతో స్పిన్నర్ శాంటర్న్ కూడా రూట్ సేనతో తుది టెస్టుకు దూరమయ్యాడు. జూన్ 10 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి టెస్టు డ్రాగా ముగిసింది.