తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్వారంటైన్ రూల్స్ వల్ల కివీస్-ఆస్ట్రేలియా సిరీస్ వాయిదా - న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన

NZ Tour of Australia: కివీస్​ జట్టు ఆస్ట్రేలియా పర్యటన వాయిదా పడింది. న్యూజిలాండ్​లో ఉన్న క్వారంటైన్ నిబంధనల కారణంగా ఈ టూర్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

new zealand
న్యూజిలాండ్

By

Published : Jan 19, 2022, 9:41 AM IST

NZ Tour of Australia: న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన వాయిదా పడింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 9 మధ్య జరగాల్సిన ఈ టూర్​ను వాయిదా వేస్తున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్(ఎన్​జెడ్​సీ) బుధవారం పేర్కొంది.

ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రభుత్వం.. విదేశాల నుంచి వచ్చే వారు 10 రోజుల క్వారంటైన్​లో ఉండాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన కివీస్​ ఆటగాళ్లు ఎప్పుడు తిరిగివస్తారన్న విషయంపై క్లారిటీ లేదు. దీంతో న్యూజిలాండ్ క్రికెట్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు టూర్​ గడువును పెంచాలంటూ ప్రభుత్వాన్ని కోరాయి. మేనేజ్డ్ ఐసోలేషన్​ అండ్ క్వారంటైన్(ఎమ్​ఐక్యూ) నిబంధనల నుంచైనా సడలింపు ఇవ్వాలని కోరాయి. దీనికి న్యూజిలాండ్ ప్రభుత్వం అంగీకరించలేదు. ఫలితంగా ఛాపెల్-హాడ్లీ సిరీస్​ వాయిదా పడింది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేలు ఓ టీ20 మ్యాచ్​ జరగాల్సి ఉంది. తొలుత జనవరి 30, ఫిబ్రవరి 2, 5 న వన్డే మ్యాచ్​లు నిర్వహించాలని, ఫిబ్రవరి 8న టీ20 జరగాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావించింది. అయితే.. వాయిదా పడిన ఈ టూర్​ ఎప్పుడు నిర్వహిస్తారన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details