ఇంగ్లాండ్తో రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు సన్నద్ధమవుతోంది. మంగళవారం నుంచి అవుట్డోర్ ట్రైనింగ్ ప్రారంభించారు. అయితే ఇప్పటివరకు అక్కడ వర్షాలు కురవడం వల్ల సోమవారం వరకు ఇండోర్ ట్రైనింగ్ చేశారు. తాజాగా దానికి సంబంధించిన అనుభవాన్ని ఆటగాళ్లు తెలిపారు.
"సౌథాంప్టన్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ వాతవరణం తడిగా ఉంది. అందువల్ల నాలుగైదు రోజుల నుంచి ఇండోర్ ట్రైనింగ్ చేస్తున్నాం. మొత్తం జట్టంతా అవుట్డోర్ ట్రైనింగ్ చేయాలని ఆశిస్తున్నారు. మొత్తంగా ఇక్కడికి వచ్చి ఆడే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది."
-విల్ యంగ్, బ్యాట్స్మన్
"ఇంత పెద్ద జట్టు ఉన్నప్పుడు.. అందరి అంచనాలకు తగ్గట్లుగా ఏర్పాట్లుచేయడం ఇండోర్ ట్రైనింగ్లో కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ అందుబాటులో ఉన్న వాటితో శిక్షణ చేయడం మన సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది."