18 ఏళ్ల విరామం తర్వాత పాకిస్థాన్‌కు వచ్చిన కివీస్.. తొలి వన్డే ఆరంభానికి కొని నిమిషాల ముందు మ్యాచ్‌ను రద్దు చేస్తూ.. తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇదే విషయంపై పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్(shoaib akhtar comments).. తన ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అప్పుడు మద్దతిచ్చాం..
పాకిస్థాన్ క్రికెట్‌ను న్యూజిలాండ్(Pak vs Nz) చంపేసిందని ట్వీట్ చేశాడు. న్యూజిలాండ్‌లో గతంలో జరిగిన పేలుళ్లకు పాక్ మద్దతుగా నిలిచిందని గుర్తుచేశాడు. క్రైస్ట్ చర్చ్‌లో జరిగిన ఈ బ్లాస్ట్‌లో 9 మంది పాకిస్థానీలు మృతిచెందారని తన ట్వీట్లో పేర్కొన్నాడు.
"మ్యాచ్‌ను(Pak vs Nz) రద్దు చేసుకునేందుకు భద్రతా కారణాలను ఎత్తిచూపిన దృష్ట్యా.. అలాంటి దాడికి సంబంధించిన సంకేతాలు రాలేదు. ఇదే విషయంపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్.. న్యూజిలాండ్ ప్రధానితో చర్చించి.. హామీ ఇచ్చినా వాళ్లు వినలేదు. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే, పీఎస్ఎల్ జట్లకు సురక్షితంగా పాక్ ప్రాతినిధ్యం వహించింది" అని తన ట్విట్టర్లో తెలిపాడు షోయబ్.
ఇదీ చదవండి:Pak vs Nz: పాక్‌కు క్రికెట్ కష్టాలు మళ్లీ మొదలు..?