తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్​ఇండియా, కివీస్​ ఆటగాళ్లు కలిసి ఇంగ్లాండ్​కు - New Zealand cricketers Team India

ఐపీఎల్​లో ఆడుతున్న న్యూజిలాండ్​ ఆటగాళ్లు టీమ్​ఇండియాతో కలిసి ఇంగ్లాండ్​కు వెళ్తారని చెప్పింది కివీస్​ క్రికెట్​ బోర్డు. జూన్ 18న సౌథాంప్టన్​లో టీమ్​ఇండియా, కివీస్​ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​(డబ్ల్యూటీసీ) ఫైనల్ ప్రారంభంకానుంది. ప్రస్తుత 15 రోజుల కఠిన క్వారంటైన్ నిబంధన నేపథ్యంలో కివీస్ ఆటగాళ్లు స్వదేశానికి వచ్చి.. అక్కడ్నుంచి ఇంగ్లాండ్​కు వెళ్లడం సాధ్యంకాదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది.

New Zealand
టీమ్​ఇండియా

By

Published : Apr 29, 2021, 8:24 AM IST

ఐపీఎల్​లో ఆడుతున్న న్యూజిలాండ్ ఆటగాళ్లు టీమ్ఇండియాతో పాటే ఇంగ్లాండ్​కు బయల్దేరతారని కివీస్ క్రికెటర్ల సంఘం సీఈఓ హీత్ మిల్స్ తెలిపాడు. 15 రోజుల కఠిన క్వారంటైన్ నిబంధన నేపథ్యంలో కివీస్ ఆటగాళ్లు సొంతగడ్డకు వచ్చి. అక్కడ్నుంచి ఇంగ్లాండ్​కు వెళ్లడం సాధ్యంకాదని చెప్పారు. జూన్ 18న సౌథాంప్టన్​లో టీమ్ండియా, కివీస్​ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​(డబ్ల్యూటీసీ) ఫైనల్ ప్రారంభంకానుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, ట్రెంట్ బౌల్ట్, కైల్ జేమీసన్, మిచెల్ శాంట్నర్​తో సహా 10 మంది కివీస్ ఆటగాళ్లు ప్రస్తుత ఐపీఎల్​లో వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జూన్ 2న ఇంగ్లాండ్​తో ప్రారంభమయ్యే రెండు మ్యాచ్​ల టెస్టు సిరీస్ కోసం 20 మంది ఆటగాళ్లతో జట్టును న్యూజిలాండ్ ప్రకటించింది. వారిలో నుంచి 15 మందిని డబ్యూటిసీ ఫైనల్​కు ఎంపిక చేయనుంది.

"ఆటగాళ్లు సొంతగడ్డకు రావడం.. రెండు వారాలు ఐసోలేషన్​లో ఉండటం.. అనంతరం ఇంగ్లాండ్​కు వెళ్లడం అంత సులువు కాదు. కాబట్టి ఐపీఎల్ లీగ్ దశ లేదా ఫైనల్​ ముగిసే వరకు కివీస్ ఆటగాళ్లంతా భారత్​లోనే ఉంటారు. లీగ్ తర్వాత కొందరు స్వదేశానికి రాను న్నారు. ప్రస్తుతం ఎక్కువ విమానాలు లేవు. ప్రయాణ ఏర్పాట్లు అంత సులభం కాదు. భారత్​లో ప్రస్తుత పరిస్థితులపై కివీస్ ఆటగాళ్లకు పూర్తి అవగాహన ఉంది. వారేమీ అందోళన చెందట్లేదు. స్వదేశానికి రావాలనుకుంటున్నట్లు ఇప్పటి వరకు ఎవరూ సుంకేతాలు ఇవ్వలేదు. భారత్​లో అత్యంత సురక్షిత ప్రదేశంలో ఆటగాళ్ల ఉన్నారు" అని మిర్చి తెలిపాడు. ప్రస్తుతం భారత్​లో ఉన్న స్కాట్ కుగెలిన్​, జిమ్మీ నీషమ్​, అడమ్​ మిల్నీ, ఫిన్​ అలెన్​, ఫెర్గూసన్​, టిమ్​ సీఫెర్ట్​లు కివీస్​ డబ్ల్యూటీసీ ఫైనల్​ జట్టులో లేదు.

ABOUT THE AUTHOR

...view details