ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముందు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేలంలో విలియమ్సన్‌ను రూ.14 కోట్ల భారీ ధరకు ఎస్‌ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. 2022 సీజన్‌లో విలియమ్సన్ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. అదే విధంగా కెప్టెన్సీ పరంగా జట్టును నడిపించడంలో కేన్ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలోనే అతడిని ఎస్‌ఆర్‌హెచ్ విడిచిపెట్టింది.
కేన్ మామపై కన్నేసిన ఐపీఎల్ టీమ్ ఇదే!.. మరీ అన్ని కోట్లా? - కేన్ విలియమ్సన్ ఐపీఎల్ టీమ్
ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ విడిచిపెట్టిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను కొనుగోలు చేసేందుకు పంజాబ్ ఫ్రాంజైజీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..
పంజాబ్ కింగ్స్‌లోకి కేన్ మామ..
ఇక వేలంలోకి వచ్చిన విలియమ్సన్‌కు ఎలాగైనా సొంతం చేసుకోవాలని పంజాబ్ కింగ్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక గతేడాది సీజన్‌లో నిరాశాజనక ప్రదర్శన కనబర్చిన పంజాబ్ కింగ్స్ కూడా తమ జట్టు ప్రక్షాళన షురూ చేసింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది సీజన్‌లో తమ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్‌ను పంజాబ్ విడుదల చేసింది.
ఈ క్రమంలో విలియమ్సన్ వంటి అనుభవిజ్ఞుడైన ఆటగాడిని దక్కించుకోవాలని పంజాబ్ ఫ్రాంజైజీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అతడికోసం దాదాపు రూ. 10 కోట్ల వరకైన వెచ్చించడానికి పంజాబ్ సిద్దంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం పంజాబ్ పర్స్‌లో రూ. 32.2 కోట్లు ఉన్నాయి. ఇక ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 23న కోచి వేదికగా జరగనుంది.