తెలంగాణ

telangana

WTC final:కేన్​​ కెప్టెన్​​ ఇన్నింగ్స్​..​ జగజ్జేతగా కివీస్

By

Published : Jun 23, 2021, 11:08 PM IST

Updated : Jun 24, 2021, 6:21 AM IST

సౌథాంప్టన్​ వేదికగా జరిగిన ప్రపంచ టెస్టు​ ఛాంపియన్​షిప్​ ఫైనల్లో న్యూజిలాండ్ విజయకేతనం ఎగురవేసింది. టీమ్ఇండియాపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్​​ విలియమ్సన్​ (52*), టేలర్​ (47*) రాణించారు.

wtc final, india vs new zealand
డబ్ల్యూటీసీ ఫైనల్, ఇండియా vs న్యూజిలాండ్

సౌథాంప్టన్​ వేదికగా జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్లో కివీస్​ ఘన విజయం సాధించింది. టీమ్ఇండియాపై 8 వికెట్ల తేడాతో కేన్​ సేన విజయకేతనం ఎగురవేసింది. తద్వారా సుదీర్ఘ ఫార్మాట్​లో విశ్వవిజేతగా న్యూజిలాండ్ నిలిచింది. కెప్టెన్ విలియమ్సన్​ (89 బంతుల్లో 52 పరుగులు), టేలర్​ (100 బంతుల్లో 47 పరుగులు) రాణించారు.

139 పరుగుల లక్ష్య చేధనలో న్యూజిలాండ్​కు లాథమ్-కాన్వే ఓపెనర్ల జంట 33 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని స్పిన్నర్​ అశ్విన్​ విడగొట్టాడు. లాథమ్​ (41 బంతుల్లో 9 పరుగులు)ను స్టంపౌట్​గా వెనక్కి పంపి భారత్​కు తొలి వికెట్​ను అందించాడు. మరికాసేపటికే కాన్వే (47 బంతుల్లో 19 పరుగులు)ను కూడా అతడే వెనక్కి పంపాడు. ఈ లెఫ్ట్​ హాండ్​ బ్యాట్స్​మన్​ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు అశ్విన్​. అనంతరం క్రీజులోకి వచ్చిన టేలర్​.. విలియమ్సన్​కు సహకరిస్తూనే మరోవైపు స్వేచ్ఛగా షాట్లు కొట్టాడు. మూడో వికెట్​కు ఈ జంట 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. జట్టును విజయతీరాలకు చేర్చింది. కాగా, తొలి, రెండు ఇన్నింగ్స్ టీమ్​ ఇండియా 217, 170 పరుగులు చేయగా.., కీవిస్ 249,140 పరుగులు చేసి డబ్ల్యూటీసీ విజేతగా నిలిచింది.

తేలిపోయిన బౌలర్లు..

ప్రతిష్ఠాత్మక ఈ మ్యాచ్​లో భారత బౌలర్లు తేలిపోయారు. ఐదుగురిలో షమి, ఇషాంత్​ మినహా మిగిలిన ముగ్గురు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. పేస్​కు సహకరిస్తున్న పిచ్​పై ప్రత్యర్థి జట్టు నలుగురు పేసర్లను జట్టులోకి తీసుకుంది. తొలుత తీసుకున్న స్పిన్నర్​ను పక్కనపెట్టింది. కానీ, భారత్​ ఇందుకు విరుద్ధంగా ఇద్దరు స్పిన్నర్లను తుది జట్టులో ఆడించడం కూడా కలిసిరాలేదు. వీరి స్థానంలో ఉమేష్ యాదవ్​ లేదా సిరాజ్​ను బరిలోకి దింపి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని పులువురు క్రీడా విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

చేతులేత్తేసిన బ్యాట్స్​మెన్..

బ్యాటింగ్​లోనూ టీమ్ఇండియా ఘోరంగా విఫలమైంది. బౌలింగ్​కు అనుకూలిస్తున్న పిచ్​పై రోహిత్ ఫర్వాలేదనిపించినా.. మరో ఓపెనర్​ గిల్​తో పాటు పుజారా, కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్​ రహానె చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. స్పిన్​ ద్వయం అశ్విన్​-జడేజా ఇక బ్యాటింగ్​లోనూ ఆకట్టుకోలేకపోయారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అనవసరపు షాట్లకు పోయి వికెట్లు ఇచ్చుకున్నారు. ప్రత్యర్థి జట్టు చూపిన సహనం చూపి ఉంటే మ్యాచ్​ను కనీసం డ్రాగానైనా ముగించేవారేమో. మొత్తానికి ఫలితమే రాదనుకున్న ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా చేజేతులా కివీస్​కు టెస్ట్​ ఛాంపియన్​షిప్​ హోదాను ఇచ్చేసింది!

ఇదీ చదవండి :'లంక టూర్​లో ద్రవిడ్​ చేయాల్సిందదే'

Last Updated : Jun 24, 2021, 6:21 AM IST

ABOUT THE AUTHOR

...view details