తెలంగాణ

telangana

ETV Bharat / sports

గంగూలీ రికార్డును బ్రేక్​ చేసిన కివీస్​ ఓపెనర్​

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న తొలిటెస్టులో న్యూజిలాండ్​ ఓపెనర్​ డెవాన్ కాన్వే సరికొత్త రికార్డు సృష్టించాడు. లార్డ్స్​ వేదికగా అరంగేట్ర మ్యాచ్​లో అత్యధిక పరుగులు చేసిన టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ సౌరవ్​ గంగూలీ 25 ఏళ్ల నాటి రికార్డును కాన్వే అధిగమించాడు.

Devon Conway breaks Sourav Ganguly's record on debut
గంగూలీ రికార్డును బ్రేక్​ చేసిన కివీస్​ ఓపెనర్​

By

Published : Jun 3, 2021, 11:27 AM IST

Updated : Jun 3, 2021, 11:58 AM IST

న్యూజిలాండ్ ఓపెనర్​ డెవాన్​ కాన్వే టెస్టుల్లో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. లార్డ్స్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతోన్న టెస్టు సిరీస్​లోని తన అరంగేట్ర మ్యాచ్​లో సెంచరీ సాధించిన ఆరో క్రికెటర్​గా కాన్వే ఘనత సాధించాడు. దీంతో ఈ స్టేడియంలో 25 ఏళ్లుగా టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ సౌరవ్​ గంగూలీ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.

లెఫ్ట్​హ్యాండ్​ బ్యాట్స్​మన్​ అయిన కాన్వే ప్రస్తుత మ్యాచ్​లో 136 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. ఇదే వేదికగా టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ సౌరవ్ గంగూలీ 1996లో అరంగేట్రం చేశాడు. తొలిమ్యాచ్​లోనే 131 పరుగులతో అలరించాడు. అయితే లార్డ్స్​లో అరంగేట్రమ్యాచ్​లో అత్యధిక పరుగులు(131 రన్స్​) చేసిన గంగూలీ రికార్డును ఇప్పుడు న్యూజిలాండ్​ బ్యాట్స్​మన్​ డెవాన్​ కాన్వే (136 రన్స్​) అధిగమించాడు. ఇందులో యాదృచ్ఛికం ఏమిటంటే వీరిద్దరూ జన్మించింది జులై 8నే!

లార్డ్స్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతోన్న మొదటి టెస్టులోని టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న న్యూజిలాండ్​ జట్టు.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి.. 246 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డెవాన్​ కాన్వే(136), హెర్నీ నికోలస్​(46) ఉన్నారు.

ఇదీ చూడండి:అత్యుత్తమ టెస్టు సారథులు.. వారి రికార్డులు!

Last Updated : Jun 3, 2021, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details