వచ్చే ఏడాది ఐపీఎల్(ipl 2022) సీజన్ కోసం మరో రెండు కొత్త ఫ్రాంచైజీలను(ipl new team) ప్రకటించింది బీసీసీఐ. అహ్మదాబాద్, లఖ్‌నవూ జట్లు వచ్చే సీజన్లో పోటీపడబోతున్నాయని అధికారికంగా వెల్లడించింది. దీంతో ఐపీఎల్-2022లో మొత్తం 10 జట్లు టైటిల్ పోరులో నిలబడనున్నాయి. అహ్మదాబాద్‌ను సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్ దక్కించుకోగా, లఖ్‌నవూ.. ఆర్పీఎస్జీ గ్రూప్‌నకు దక్కింది. సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్ ₹5,625 కోట్లకు, ఆర్పీఎస్జీ గ్రూప్ 7,090 కోట్లతో ఈ ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. రెండు కొత్త జట్ల ఫ్రాంఛైజీల కోసం బీసీసీఐ ఇటీవల బిడ్లు ఆహ్వానించింది.
కొత్త జట్ల వివరాలు
ఫ్రాంచైజీ | యాజమాన్యం | ధర |
లఖ్‌నవూ | ఆర్పీసీజీ వెంచర్స్ లిమిటెడ్ | రూ.7.090 కోట్లు |
అహ్మదాబాద్ | ఐరెలియా కంపెనీ ప్రై.లి (సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్) | రూ.5625 కోట్లు |
మొత్తం 74 మ్యాచ్‌లు
వచ్చే సీజన్లో మొత్తం 10 జట్లతో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో ప్రతి జట్టు సొంత మైదానంలో 7, ప్రత్యర్థి మైదానంలో 7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.