ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్‌కు(IPL 15th Edition) సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) బ్లూప్రింట్ ఖరారు చేసింది. ఇందులో ఐపీఎల్లో చేరనున్న కొత్త ఫ్రాంఛైజీలతో పాటు ప్లేయర్ల మెగా వేలం, ఫ్రాంఛైజీల సాలరీ పర్స్‌లో పెరుగుదల, మీడియా హక్కుల వంటి విషయాలలో పలు మార్పులు రానున్నాయి. సంబంధిత ప్రణాళికలు 2021 ఆగస్టు నుంచి 2022 జనవరి మధ్యలో విడుదల కానున్నాయి.
మరో రెండు జట్లు..
వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి రెండు కొత్త ఫ్రాంఛైజీలను లీగ్‌లోకి తీసుకురావాలని బీసీసీఐ యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన టెండర్ డాక్యుమెంట్ ఆగస్టులో విడుదల చేస్తారు. చెక్‌లు, బిడ్లు, కొత్త జట్లు ఏవనే విషయాలు అక్టోబర్ మధ్యలో పరిచయమవుతాయి. ఈ ఏడాది డిసెంబర్లో మెగా వేలం జరుగుతుంది.
కోల్‌కతాకు చెందిన ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్, అహ్మదాబాద్‌కు చెందిన అదానీ గ్రూప్, హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా లిమిటెడ్, గుజరాత్‌కు చెందిన టోరెంట్ గ్రూప్.. కొత్త జట్ల రేసులో ఆసక్తి చూపుతున్నాయి. వీటితో పాటు మరికొన్ని కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ ఈక్విటీ, సలహా సంస్థలు కూడా కొత్త ఫ్రాంఛైజీల రేసులో ఉన్నాయి.
సాలరీ పర్స్‌లో పెరుగుదల..
ఇక ప్రతి ఫ్రాంఛైజీ సాలరీ పర్స్‌ను రూ.5 కోట్లు పెంచింది బీసీసీఐ. ఇప్పటివరకు రూ.85 కోట్లుగా ఉన్న మొత్తాన్ని.. రూ.90 కోట్లకు పెంచింది. దీంతో మొత్తంగా 10 ఫ్రాంఛైజీలకు రూ.50 కోట్లు సాలరీ పర్స్ పెంచినట్లైంది. ఇందులో నుంచి ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల కొనుగోలుకు 75 శాతం తప్పనిసరిగా ఖర్చు పెట్టాలి. వచ్చే మూడేళ్లలో అంటే 2024 సీజన్ వరకు ఈ మొత్తం రూ.100 కోట్లకు చేరనుంది.
ఇదీ చదవండి:హెచ్‌సీఏలో మరో మలుపు.. ఏం జరిగిందంటే?