IND vs SA: దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ విజయాన్ని అందుకోవాలనే ఆశలు కొట్టుమిట్టాడుతున్న వేళ.. చివరి ఇన్నింగ్స్‌లో పంత్ పోరాటం.. సిరీస్ సాంతం పుజారా, రహానె వైఫల్యాలపై చర్చ జోరందుకుంది. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తో సమాధానం చెబుతూ పంత్ సెంచరీ సాధించాడు.
మరోవైపు పుజారా, రహానె మాత్రం జట్టును మరింత కష్టాల్లో నెట్టి పెవిలియన్ చేరారు. గత రెండేళ్లుగా ఈ సీనియర్ ద్వయం బ్యాటింగ్‌లో విఫలమవుతూనే ఉంది. కానీ సఫారీ గడ్డపై సుదీర్ఘ ఫార్మాట్లో తొలి సిరీస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఈ కీలక పర్యటనకు ఈ ఇద్దరిని కొనసాగించారు. కానీ వాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. విదేశీ పిచ్‌లపై మెరుగ్గా ఆడతాడనే పేరున్న రహానె, క్రీజులో గంటల పాటు పాతుకుపోయి ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్ష పెడతాడని చెప్పుకునే పుజారా.. ఆ అంచనాలు నిలబెట్టుకోలేకపోయారు.
ఈ సిరీస్‌లో రహానె కేవలం 22.66 సగటుతో 136 పరుగులు మాత్రమే చేశాడు. 20.66 సగటుతో 124 పరుగులే సాధించిన పుజారా పరిస్థితి ఇంకా దారుణం. ఎంతో అనుభవమున్న ఈ ఇద్దరూ.. ఆఫ్‌స్టంప్ ఆవల పడ్డ బంతులను వేటాడి, అధిక బౌన్స్‌ను అంచనా వేయలేక పెవిలియన్ చేరిన తీరు ఆందోళన కలిగిస్తోంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో చెరో అర్ధశతకంతో పోరాడిన వీళ్లు.. ఫామ్ అందుకున్నారేమో అనిపించింది. కానీ చివరి టెస్టుకు వచ్చేసరికి షరా మామూలే. దీంతో వీళ్ల పనైపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీళ్లను ఉద్దేశించి చేస్తున్న 'పురానె (పాత)' అన్న హ్యాష్‌ట్యాగ్ చక్కర్లు కొడుతోంది.
తప్పులు తెలుసుకుని..