T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2022 సూపర్-12లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ బ్యాటర్లను పాక్ బౌలర్ల వణికించారు. నిప్పులు చెరిగే బంతులను సంధించారు. పాకిస్తాన్ బౌలర్ల ధాటికి నెదర్లాండ్స్ బ్యాటింగ్ కుప్పకూలింది. మూడంకెల స్కోర్‌ను కూడా చేయలేకపోయింది.
అయితే హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో ఓపెనర్ బాస్ డీ లిడె తీవ్రంగా గాయపడ్డాడు. రవూఫ్ సంధించిన రాకాసి బౌన్సర్‌ను షాట్ ఆడబోయిన లిడె టైమింగ్ మిస్ అయ్యాడు. అది నేరుగా అతడి ముఖాన్ని తాకింది. హెల్మెట్ గ్రిల్స్ కూడా అడ్డుకోలేకపోయాయి. 140 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఆ బంతి ధాటికి లిడె కంటి కింద గాయమైంది. హెల్మెట్ సైతం క్రాక్ అయినట్లు గుర్తించారు. కొద్దిసేపు క్రీజ్‌లోనే కూర్చుండి పోయాడు లిడె. ఫిజియో సూచనల మేరకు మైదానాన్ని వీడాడు. మళ్లీ ఫీల్డ్‌లోకి దిగలేదు.