Neeraj Chopra Asian Games 2023 Javelin Throw : దేశానికి ప్రాతినిధ్యం వహించడం.. పతకం సాధించడం ప్రతీ ఆటగాడి కల అని భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా అన్నాడు. చిన్నారులను ఏ రంగంలో ఆసక్తి ఉంటే అటువైపే ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించాడు. ప్రపంచవ్యాప్తంగా తనకు గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్న నీరజ్.. వచ్చే ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం తేవడమే లక్ష్యంగా శ్రమిస్తున్నట్లు చెప్పాడు. భవిష్యత్తు లక్ష్యాల గురించి ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ముఖాముఖిలో తన అభిప్రాయాలను అతడు వెల్లడించాడు.
"దేశానికి ప్రాతినిధ్యం వహించడం, పతకాలు సాధించడం ప్రతీ ఆటగాడికి ఒక కల. అదే నా కల కూడా. అందుకే నేను నిరంతరం శ్రమిస్తున్నాను. విశ్వాసంతో ముందుకు సాగుతున్నాను. ఆసియా గేమ్స్‌లో ఆరంభం మొదలైంది. దానిని ముందు కూడా కొనసాగించాలని భావిస్తున్నాను. క్రీడల్లో మార్పు మొదలైంది. ఒక ఆటను వదిలిపెట్టి మరో దానికి వెళ్లటం జరగదు. మీరు ఏ పని చేసినా కొంత సమయం తీసుకోండి. ఏ రంగంలో రాణించాలన్నా కొంత సమయం పడుతుంది. ఆట మారినంత మాత్రం విజయం లభిస్తుందని చెప్పలేం. ఏ రంగంమైనా కొంత సమయం కేటాయించాలి. శ్రమించాలి. అప్పుడే సఫలమవుతారని చెప్పదలచుకున్నా. ఏ రంగమైనా ఎంచుకోండి. కానీ క్రీడలకు కొంత చోటు ఇవ్వండి. రోజుకు ఒక గంటో, అరగంటో తప్పక కేటాయించండి." అని నీరజ్ పేర్కొన్నాడు.