తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇది మాకు కొత్తేమి కాదు.. తప్పకుండా జైషాతో చర్చిస్తా: PCB ఛైర్మన్​ - pcb chairman update over asia cup2023 row

భారత్​, పాకిస్థాన్​ మ్యాచ్​ చూడటానికి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అయితే ఆసియా కప్ సందర్భంగా పాక్‌లో టీమ్‌ఇండియా పర్యటించదని బీసీసీఐ కార్యదర్శి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ భేటీ జరగబోతోంది. అయితే తాను జైషాతో ప్రత్యేకంగా సమావేశమవుతానని పీసీబీ ఛైర్మన్‌ నజామ్​ సేథీ తెలిపారు.

najam sethi on indian board stance over asia cup row
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నిజాం సేథి

By

Published : Jan 26, 2023, 1:37 PM IST

ఆసియా కప్‌ 2023 టోర్నమెంట్‌ నిర్వహణను పాకిస్థాన్‌కు అప్పగించినప్పటి నుంచి.. భారత క్రికెట్‌ నియంత్రణ బోర్డు (బీసీసీఐ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య ఘాటు మాటల యుద్ధం మొదలైంది. పాకిస్థాన్​లో ఆసియా కప్‌ నిర్వహిస్తే భారత్‌ పర్యటించదని బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) జై షా ప్రకటించారు. దీనిపై నాటి పాకిస్థాన్ క్రికెట్ బోర్డుఛైర్మన్‌ రమీజ్‌ రజా కూడా స్పందిస్తూ.. పాకిస్థాన్​లో టీమ్‌ఇండియా ఆడకపోతే, ప్రపంచకప్‌లో పాక్‌ ఆడేదిలేదని ప్రకటించారు. భారత్‌ వేదికగానే వన్డే ప్రపంచకప్‌ 2023 మెగా టోర్నీ జరుగుతుంది. తాజాగా పీసీబీ ఛైర్మన్‌గా నజామ్‌ సేథీ వచ్చారు. జైషాతో తప్పకుండా భేటీ అవుతానని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు ఏసీసీ భేటీకి హాజరవుతున్నట్లు, జైషాతో ప్రత్యేకంగా సమావేశమవుతానని సేథీ వెల్లడించాడు.

"ఆసియా కప్‌ కౌన్సిల్ అధికారులను కలిసే సమయం వచ్చింది. ఫిబ్రవరి 4వ తేదీన బహ్రెయిన్‌ వేదికగా ఏసీసీ మీటింగ్‌ జరగనుంది. ప్రస్తుతం మా బోర్డు వైఖరిని తెలియజేసేందుకు ఇదొక అవకాశం. ఇది పాకిస్థాన్‌ క్రికెట్‌కు సాయపడుతుందని భావిస్తున్నా. భారత్‌లో పాకిస్థాన్‌ పర్యటించాలని బీసీసీఐ కోరుకుంటుంది. కానీ పాక్‌లో ఆడేందుకు మాత్రం అంగీకరించడం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు మాకు కొత్తేమీకాదు. దీనిపై తప్పకుండా మాట్లాడతా" అని నజామ్ సేథీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details