తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వన్డేల్లో నా గణాంకాలు మరీ అంత చెత్తగా లేవు.. మీరే ఏవేవో అనుకుంటున్నారు' - రిషభ్‌ పంత్ విఫలమవుతున్న దానిపై స్పందన

టీమ్​ఇండియా క్రికెటర్​ రిషభ్​ పంత్​ తన ఆటతీరుపై గత కొద్ది రోజులుగా మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా పంత్​ ఆ వ్యాఖ్యలపై స్పందించాడు. ఏమన్నాడంటే..?

rishabh pant
రిషభ్​ పంత్​

By

Published : Nov 30, 2022, 12:23 PM IST

Updated : Nov 30, 2022, 12:31 PM IST

వరుసగా విఫలమవుతున్న రిషభ్‌ పంత్‌కు అవకాశాలు ఇవ్వడంపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తీవ్రంగా విమర్శల దాడి చేస్తున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలోనూ రిషభ్‌ విఫలం కావడం సెలెక్షన్ కమిటీకి తలనొప్పిగా మారింది. మరోవైపు జట్టులోకి వచ్చేందుకు ఆశావహులు ఎక్కువైపోయారు.

బయట నుంచి వస్తున్న విమర్శలంత దారుణంగా తన వైట్‌బాల్‌ (వన్డేలు, టీ20లు) క్రికెట్‌ గణాంకాలు లేవని టీమ్ఇండియా యువ బ్యాటర్ రిషభ్‌ పంత్ స్పష్టం చేశాడు. టెస్టుల్లో రాణిస్తూ.. వన్డేలు, టీ20ల్లో విఫలం కావడంపై మాజీల నుంచి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కివీస్ పర్యటనలో ఉన్న రిషభ్‌ పంత్.. ఆ వ్యాఖ్యలపై స్పందించాడు. అలాగే టీ20 ఫార్మాట్‌లో ఓపెనింగ్‌ చేయడంపై ఆసక్తి చూపిస్తానని, వన్డేల్లో మాత్రం నాలుగు లేదా ఐదో స్థానంలో ఆడేందుకు ఇష్టపడతానని వెల్లడించాడు.

"అవకాశం వస్తే టీ20ల్లో ఓపెనర్‌గా.. వన్డేల్లో 4 లేదా 5వ స్థానం.. ఇక టెస్టుల్లో నా ఫేవరేట్‌ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం ఇష్టం. వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్‌ చేసేటప్పుడు గేమ్ ప్లాన్‌ మారిపోతూ ఉంటుంది. అదే సమయంలో జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. టీ20లతో పోలిస్తే వన్డేల్లో మరీ దూకుడుగా వెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే నా బ్యాటింగ్‌ గణాంకాల గురించి చాలా మంది ఏవేవో అనుకుంటున్నారు. ఒకసారి నా వన్డేలు, టీ20ల్లో గణాంకాలను చూస్తే మీకే తెలుస్తుంది. మరీ బయట చెప్పేంత చెత్తగా మాత్రం లేవు" అని పంత్‌ తెలిపాడు. తాజాగా కివీస్‌తో మూడో వన్డేలోనూ పంత్ కేవలం 10 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. రిషభ్‌ పంత్ మొత్త 29 వన్డేల్లో 107.5 స్ట్రైక్‌రేట్‌తో 855 పరుగులు, 66 టీ20ల్లో 126.4 స్ట్రైక్‌రేట్‌తో 987 పరుగులు చేశాడు.

ఇవీ చదవండి:కివీస్​తో సిరీస్‌ సమం చేయాలంటే.. వరుణుడు ఆగాల్సిందే!

అది రొనాల్డో రేంజ్​.. ఈ ఒక్క మ్యాచ్​ చూస్తే..

Last Updated : Nov 30, 2022, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details