అంతర్జాతీయ క్రికెట్‌కు తాను వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైందని అన్నాడు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్(Chris Morris News). రిటైర్మెంట్ను అధికారికంగా ప్రకటించడం ఇష్టం లేదని అన్నాడు. జట్టులో కొనసాగే ఉద్దేశం తనకులేదని, ఈ విషయం తమ బోర్డుకు కూడా తెలుసని ఓ క్రీడా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
"దక్షిణాఫ్రికా జట్టు తరఫున ఆటకు ముగింపు పలికే సమయం వచ్చేసింది. అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించను. నేనేంటో నాతో సహా క్రికెట్ సాతాఫ్రికాకూ తెలుసు. ఇకపై జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించలేను."
--క్రిస్ మోరిస్, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్.
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో క్రిస్ మోరిస్.. తుది జట్టుకు ఎంపిక అవ్వలేదు(Chris morris south africa news). ఈ నేపథ్యంలోనే మోరిస్ ఈ వ్యాఖ్యలు చేశాడు.