క్రికెట్లో వికెట్ పడిన వెంటనే బౌలర్లు వేడుక చేసుకోవడం సహజం. ఒక్కో బౌలర్‌ది ఒక్కో శైలి! తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టేస్టుల్లో టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ కొత్త స్టైల్‌ని అనుసరిస్తున్నాడు. వికెట్ తీసిన ప్రతిసారి.. బ్యాట్స్‌మన్‌వైపు చూస్తూ మౌనంగా వెళ్లిపోమ్మని.. పెదవులపై వేలు పెట్టుకుని సైగలు చేస్తున్నాడు. దీనిని పలువురు మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. అంత అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అయితే దీని వెనుక ఓ కారణం ఉందని తాజాగా సిరాజ్ వెల్లడించాడు.
"నేను అలా వేడుక చేసుకోవడానికి కారణం నా విమర్శకులు. నేను ఏదీ చేయలేనని, నా గురించి చాలా చెబుతుంటారు. నన్ను ద్వేషించేవారికి నా బంతితోనే సమాధానం చెబుతా. అందుకే ఈ కొత్త తరహా వేడుక."
-మహ్మద్ సిరాజ్, టీమ్ఇండియా బౌలర్