మే నెలకుగానూ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'(Player of The Month) అవార్డు విజేతలను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC). పురుషుల విభాగంలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్(Mushfiqur Rahim), మహిళల విభాగంలో స్కాట్లాండ్ ఆల్రౌండర్ కేథరిన్ బ్రైస్(Kathryn Bryce).. ఈ అవార్డులను గెలుచుకున్నారు.
శ్రీలంకతో జరిగిన ఒక టెస్టుతో పాటు 3 వన్డేల సిరీస్లో ముష్ఫికర్ రాణించాడు. లంకపై తొలి వన్డే సిరీస్ గెలవడానికి తన వంతు పాత్ర పోషించాడు. రెండో వన్డేలో 125 పరుగులు చేశాడు.