వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం టీమ్‌ఇండియా కీలక ఆటగాళ్లు ట్రినిడాడ్ చేరుకొన్నారు. ఈ నెల 29 నుంచి ఈ సిరీస్ మెదలవుతుంది. ఈ రోజు విండీస్‌తో టీమ్‌ఇండియా చివరి వన్డే ఆడనుంది. ఇది పూర్తయ్యాక పొట్టి సిరీస్‌కు సన్నద్ధం అవుతారు. అయితే, మంగళవారం సాయంత్రం యువ బ్యాటర్ రిషభ్ పంత్.. సహచరులు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లతో కలిసి సరదాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌ను నిర్వహించాడు.
అభిమానులతో సూర్య, రోహిత్, పంత్ ముచ్చట్లు.. లైవ్‌లోకి ధోనీ
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి సరదాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌ను నిర్వహించాడు రిషభ్ పంత్. వీరంతా కాసేపు అభిమానులతో ముచ్చటించారు. అయితే లైవ్‌లోకి ధోనీని లాగేందుకు పంత్ ప్రయత్నించడం గమనార్హం.
ఈ సెషన్‌లో క్రికెటర్లు కొంతమంది అభిమానులతో సంభాషించారు. ఈ సమయంలో లైవ్‌లోకి ఎంఎస్ ధోనీని లాగడానికి పంత్ ప్రయత్నించాడు. కానీ, ధోని ఫోన్‌ను ఆఫ్ చేశాడు. అయితే, కాసేపటికి ధోని లైవ్‌లోకి రాగానే రోహిత్, సూర్య నవ్వడం మొదలుపెట్టారు. ఈ సెషన్‌లో ధోనితో పంత్ మాట్లాడుతూ..‘మహీ భాయ్ ఎలా ఉన్నావు? కాసేపు లైవ్‌లో ఉండు భయ్యా’ అని అన్నాడు. అయితే.. పంత్ ఈ విషయం చెప్పగానే ధోని నవ్వుతూ కెమెరా ఆఫ్ చేశాడు. ఆ తర్వాత పంత్, రోహిత్, సూర్య.. కాసేపు అభిమానులతో ముచ్చటించారు. క్రికెట్ సంగతులు పంచుకున్నారు.